ఈనాడు 17 నవంబర్ 2019 సౌజన్యంతో...
ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అనేది వినడానికి బాగుంటుంది. కానీ ఆచరణలో దీని ఫలితాల పట్ల కొంతమంది మేధావి వర్గంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో తెలుగు మాధ్యమాన్ని పెట్టమని డిమాండ్ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమం పెడుతుంటే వ్యతిరేకత రావడం కొన్ని సంపన్న వర్గాల కుట్రగా వ్యాఖ్యానిస్తున్న వాళ్ళున్నారు. కానీ, పేద వర్గాలకు ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమం రెసిడెన్షియల్ పాఠశాల్లో విజయం సొంతమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టం. పాఠశాల నుండి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే సందేహాలు తీర్చేదెవరు? అందువల్ల దీర్ఘకాలంలో వీళ్ళు పాఠశాలలకు వెళ్ళడం మానేసే అవకాశం ఉంది. ఆంగ్ల భాషను కూడా ఒకటో తరగతి నుంచి నేర్పండి.కానీ మాధ్యమం విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిది....
---ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి