"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

15 November, 2019

విద్య ఉత్తమ పౌరసత్వాన్ని నేర్పేదిగా ఉండాలి ( మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి ) 14.11.2019 కార్యక్రమం వివరాలు

భారతీయత, జాతీయ సమగ్రత, ఉత్తమ పౌరసత్వాన్ని పెంపొందించేదే నిజమైన విద్యావిధానమని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశించి, అటువంటి విద్యావిధానాన్ని మనకు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని సెంట్రల్ యూనివర్సిటి సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య అరుణ్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. 


నవంబరు 11 వతేదీన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని, భారతదేశం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు గురువారం (14.11.2019) ఆయన బహుమతి ప్రదానం చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందు మనం భారతీయులమనీ, తర్వాతనే మన కుల, మత, భాషలను గుర్తించాలని, దీనికి అనుగుణమైన విద్యా విధానాన్ని రూపకల్పన చేయడంలోను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఏర్పాటులోను ఆజాద్ ప్రవేశపెట్టిన విద్యావిధానం ఎంతో ఉపకారిగా ఉందని ఆయన వివరించారు.  డిపార్టెమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ శాఖాధిపతి ఆచార్య భువనేశ్వరి లక్ష్మి అధ్యక్షతన సోషల్ సైన్సెస్ సెమినార్ హాల్ లో ఆ శాఖ మరియు డీన్, స్టూడెంట్స్ వెల్పేర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘జాతీయ విద్యా దినోత్సవం’ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన ఆచార్య భువనేశ్వరి లక్ష్మి మాట్లాడుతూ విద్యావిధానం మానవీయవిలువల్ని పెంచేలా ఉండాలన్నారు. డిప్యూటి డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో త్రిభాషా సూత్రం కలిగిన విశిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నదనీ, దీనివల్ల మాతృభాషలు, హిందీ, ఆంగ్ల భాషల్ని అభ్యసిస్తూ భారతీయ సంస్కృతిని నిలుపుకుంటూనే, ప్రపంచ జ్ఞానాన్ని పొందడానికి వీలవుతుందన్నారు. భారతీయ తొలి ఉన్నత విద్యామంత్రిగాపనిచేసిన మౌలానాఅబుల్ కలామ్ ఆజాద్ వేసిన పునాది మన విద్యావిధానాన్ని మరింత పరిపుష్టి చేసి, నిజమైన జాతీయ సమగ్రతకు దోహదం చేస్తుందన్నారు.  తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్వహించిన వ్యాస రచనపోటీల్లో గెలుపొందిన  విజేతలకు మూడేసి బహుమతులు చొప్పున నగదు, ప్రశంసాపత్రాలను అందించారు.  వరుసగా 1500, 1000, 500 రూపాయలు చొప్పున మూడు భాషల వారికీ నగదు పురస్కారాలను అందించారు.

 తెలుగులో ప్రథమ ( ధన్యశ్రీ), ద్వితీయ ( మాలిక్), తృతీయ మౌనిక, హిందీలో హర్షవర్థన్, సోహెబ్ ఖాన్, శిరీష, ఆంగ్లంలో అస్మా జమల్, అంకితారాయ్, శంకర్ లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఈ కార్యక్రమంలో డా.రావుల కృష్ణయ్య, డా.సుమాలిని, డా.జలంధరాచారి, డా.మధుసూదన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
















No comments: