తొలి తరం తెలుగు భాషా, సాహిత్య పరిశోధకులు మౌలికమైన విషయాలపై పరిశోధన చేశారని, వాటిని ఆధారంగా చేసుకుని నేటి తరం పరిశోధకూ కొత్త అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు ఏర్పాటు చేసిన తెలుగు భాషా సాహిత్య పరిశోధకులకు జరుగుతున్న శిక్షణా తరగతులలో ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు బుధవారం ఉదయం ప్రసంగించారు. ''తెలుగు పరిశోధన పరిణామ వికాసాలు అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలి తరం పరిశోధకులు మాత్రమే ప్రామాణికమైన పరిశోధనలు చేశారని అనుకోవడం సరైనది కాదనీ, సమకాలీన పరిశోధకులు కూడా కొత్త అంశాలతో, సమాజానికి అవసరమైన భాషా సాహిత్య పరిశోధనలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పరిశోధనల్లో వితండ వాదం అంటే శాస్త్రీయమైన ఇటువంటి నిరూపణకు అవకాశం ఉంటే పరిశోధనలు నిలుస్తాయని అవి సమాజానికి ఉపయోగ పడతాయని ఆయన సోదాహరణంగా వివరించారు. తెలుగులో పోచిరాజు వీరన్న ను తొలి పరిశోధకుడుగా చాలామంది భావిస్తున్నారని మరికొంతమంది తప్పక విని తొలి పరిశోధకుడుగా పేర్కొన్నారని కానీ, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో పరిశోధనలో శాస్త్రీయ దృక్పధాన్ని ప్రవేశపెట్టిన పరిశోధకులు కల్నల్ మెకంజీ, సి.పి.బ్రౌన్, కాల్డ్వెల్ లను తెలుగు పరిశోధనలకు నిజమైన ఆద్యులుగా గుర్తించాలని ఆయన అన్నారు. తెలుగు లో జరిగిన పరిశోధనల తీరుతెన్నుల గురించి హైదరాబాద్ విశ్వవిద్యాలయం తొలితరం పరిశోధకుల పై ప్రచురించిన తొలితరం పరిశోధకులు అనే సదస్సు సంచిక, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన తెలుగు పరిశోధన రజతోత్సవ సంచిక, ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు ప్రచురించిన విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన మొదలైన గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని గమనించడం ద్వారా పరిశోధనలు జరుగుతున్న తీరు తెన్నులు తెలియడమే కాకుండా, భవిష్యత్తులో జరగవలసిన పరిశోధనలు తెలుసుకోవడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఈ శిక్షణా తరగతులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్య ధనుంజయ్ అధ్యక్షత వహించారు. తెలుగు పరిశోధనా పరిణామం అనే అంశంపై ప్రసంగించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సూర్య ధనుంజయ్, తెలుగు అధ్యాపకులు డా.సి.కాశీం, డా.వారిజా రాణి తదితరులు ఘనంగా సత్కరించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు పరిశోధన విద్యార్థిని, విద్యార్ధులకు 14.11.2018 వ తేదీ ఉదయం '' తెలుగు పరిశోధన పరిమాణం'' అనే అంశంపై ప్రసంగిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు అధ్యాపకుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు...
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సూర్య ధనుంజయ్, డా.సి.కాశీం తదితరులు చిత్రంలో ఉన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి