రైలుశక్తి సంపాదకుడు, ప్రముఖ రచయిత వేల్పూరి కామేశ్వరరావు ఫేసు బుక్ లో రాసిన రచనలను 'అగ్నిగోళాలు' పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఆదివారం సాయంత్రం శేరిలింగంపల్లి రెలుశక్తి కార్యాలయంలో శ్రామికులు శ్రీమతి మొగులమ్మ,, శ్రీమతి మేరి, శ్రీమతి నాగమ్మ, శ్రీమతి నరసమ్మ, శ్రీ అనంతయ్య, శ్రీ కృష్ణ తదితరులు ఆవిష్కరించారు. పనిచేసుకోవడమే తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో కొత్తగా ఉందనీ, శ్రామికులకు ఎంతో విలువిచ్చినట్లు భావిస్తున్నామని వారున్నారు. సమకాలీన సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతోందని రచయిత వేల్పూరి కామేశ్వరరావు అన్నారు. ఫేసు బుక్ లో రాసిన రచనల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, దాని ప్రభావం వల్ల ప్రజలెలా ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుందని ఆయన వివరించారు. సంప్రదాయకంగా కొనసాగుతున్న కొన్ని దురాచారాలను ప్రశ్నించాల్సిన అవసరమేంటో ఈరచనలు చదివితే తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా తొలి ప్రతిని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాలు, శ్రామికులు, హోటల్లో పనిచేసేవారితో పుస్తకాల్ని ఆవిష్కరించిన చరిత్ర దిగంబర సాహిత్య కారులు కొనసాగించాలని, అటువంటి కార్యక్రమం మరలా ఇప్పుడు జరగటం ఇదేనని ఆయన చెప్పారు. ఫేసు బుక్ లో రాసిన రచనలను పుస్తక రూపంలో తీసుకొని రావడం వల్ల ఫేసు బుక్ చదువులేని వాళ్ళు కూడా చదువుకొనే అవకాశం ఉంటుందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి