"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

11 సెప్టెంబర్, 2019

కలలు విరిగినప్పుడు!

వాటికి
మన ఇష్టాయిష్టాలతో పనేముంది?
నవ్వించవచ్చు
కవ్వించవచ్చు
సంగీతంవినిపించవచ్చు
సంతాపాన్ని ప్రకటించవచ్చు
మనసుని
దూదిమేడల్లో ఊరేగించవచ్చు
ధూళికణాల్లో విసిరెయ్యవచ్చు
అవి కలలు
పన్నీళ్ళ జల్లులవుతాయి
అవి కలలు
కన్నీళ్ళ జల్లులవుతాయి
ఆ కలల కూలిన చప్పుడికి
భూ నభోంతరాలు దద్దరిల్లవచ్చు!
- దార్ల వెంకటేశ్వరరావు, 11.9.2019

కామెంట్‌లు లేవు: