10 సెప్టెంబర్, 2019
సెంట్రల్ వర్సిటి పూర్వ విద్యార్థి, త్రిపుర ప్రభుత్వ కార్యదర్శి శ్రీ నాగరాజు ప్రసంగం
నిన్న అనగా 9 సెప్టెంబరు 2018 వ తేదీన విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీ ఎం.నాగరాజు, ఐ.ఏ.ఎస్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, సర్ సి.వి.రామన్ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థి ప్రసంగాల్లో భాగంగా తొలిప్రసంగాన్ని చేశారు. ఈకార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలె అధ్యక్షత వహించారు.
1990తర్వాత భారతదేశం లో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, తదనంతరం భారతదేశ ఆర్థిక పరిస్థితులు, విధాననిర్ణేతల ఆలోచనల గురించి శ్రీ నాగరాజుగారు లోతైన ప్రసంగం చేశారు. ఈసందర్భంగా వక్తను ఆచార్య అప్పారావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రస్తుత పరిశోధకులు ఆయనతో జరిపిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. స్టూడెంట్స్ వెల్ఫేర్, అల్యూమనై సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.వైస్ ఛాన్సలర్లు ఆచార్య అగర్వాల్, ఆచార్య రాజశేఖర్, కో ఆర్డినేటర్, డిప్యూటీ డియస్ డబ్యు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.పద్మజ, హ్యుమానిటీస్ డీన్ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి, మెడికల్ సైన్స్ డీన్ ఆచార్య ప్రకాష్ బాబు, ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య మహ్మద్, సతీష్ అధికసంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసులో శ్రీ నాగరాజుగార్కి చిరుసత్కారం జరిగింది. ఈ సత్కార కార్యక్రమంలో డిప్యూటి డీన్, అల్యూమినై కోర్డినేటర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్ డా. పద్మజ, ఆఫీసు సిబ్బంది మురళీధర్, సతీష్, డా.హైమవతి, శ్రీ సుభాష్, శ్రీ అరవింద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి