బడ్జెట్ గురించి ఎదురుచూసే
మధ్యతరగతి ఉద్యోగులకు, అదీ 5 లక్షలలోపు జీతం వచ్చేవారికి ఎంతోఊరటనిచ్చేలా ఉంది. కానీ, స్టాండర్డ్
డిడక్షన్ కూడా 5 లక్షలకు పెంచితే బాగుండేది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి
ఇచ్చినంత ఆర్థిక రాయితీని ఉన్నతోద్యోగులకు కూడా పెంచితే బాగుండేది. నేటికీ 10, 20,
30 శాతం అనే విధానంలో మార్పులు తీసుకొనిరావాలి. ఏడవ వేతన సంఘం కొత్తవేతనాలు
ఇచ్చినా ఉద్యోగులకు ఒదిగేదేమీ లేదన్నట్లే ఉంది. అయితే, కొత్తగా ఋణాలు తీసుకొని
ఇళ్ళుకట్టుకునేవారికి కూడా మినహాయింపునివ్వడం వల్ల గృహనిర్మాణరంగానికి మంచి
ఊపొస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును
ప్రోత్సహించడం అభినందనీయం. విద్యారంగంలో విదేశీ విద్యకు ప్రాధాన్యాన్నివ్వడం,
ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించే సిసికెమేరావ్యవస్థకు తూట్లు పొడవడం వంటివాటి
గురించి మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది.డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం
ఆహ్వానించదగ్గపరిణామం. అలాగే, ఈ సారి పరిశోధనలను ప్రోత్సహించడం కూడా మంచి
ఆలోచన. మొత్తం మీద శాశ్వత ప్రయోజనాల్ని
ఆశించేలా బడ్జెట్ ని రూపొందించారు.
– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
ప్రొఫెసర్, తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్
యూనివర్సిటి, హైదరాబాద్ , ఫోను : 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి