దళిత ఓపెన్ యూనివర్సిటి ఆఫ్
ఇండియా, గుంటూరు వారు ఈ యేడాది డా.బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని
ప్రముఖకవి, విమర్శకుడు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా
పనిచేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం ప్రతీ
యేడాదీ జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్నవారికి డా.అంబేద్కర్
జాతీయపురస్కారాలతో సత్కరిస్తుంది. ఈనెల 13 వ తేదీన, గుంటూరులో నిర్వహించే విశ్వవిద్యాలయం
స్నాతకోత్సవంలో పురస్కారగ్రహీతకు ఐదువేలరూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో
సత్కరిస్తుంది.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సెంట్రల్ యూనివర్సిటీలో గత పద్దెనిమిదేండ్లుగా పనిచేస్తూ, పరిశోధన, విమర్శ, కవిత్వ
ప్రక్రియల్లో సుమారు 16 గ్రంథాలను, 102 పరిశోధన పత్రాలు, వ్యాసాలు ప్రచురించారు.
ఈయన పర్యవేక్షణలో పదిమంది డాక్టరేట్ డిగ్రీలను, 19 మంది ఎం.ఫిల్ డిగ్రీలను
అందుకున్నారు. ఈయన కవిత్వం ‘ది వాయిస్ ఆఫ్
దళిత్ : ది పోయెట్రీ ఆఫ్ దార్ల వెంకటేశ్వరరావు’ పేరుతో ఆంగ్ల గ్రంథంగా
ప్రచురితమైంది. అంతే కాకుండా ఈయన రచనలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లోను
ప్రచురితమయ్యాయి. ఆక్సఫర్డ్ ప్రెస్ వారి గ్రంథాల్లోను, (The Oxford India Anthology of Telugu Dalit Writing), ఇప్పటికే ఈయనకు భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ (2007)వారు, పొట్టిశ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం(2012), వివిధ సంస్థలు అనేక పురస్కారాలతో సత్కరించింది. సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ.,
స్థాయిలో పాఠ్యాంశాలుగా దళితసాహిత్యం,
డయాస్పోరాసాహిత్యం మొదలైన కొన్ని కొత్తకోర్సులను ప్రవేశపెట్టారు. ఈయన ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి
గాను 2016
అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుకి గాను లక్షరూపాయల
ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేశారు. ప్రస్తుతం స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డీన్ గాను, అల్యూమినా
విభాగం కోర్డ్ నేటర్ గాను అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయనకు ఈ పుస్కారం
రావడం పట్ల పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి