ప్రాచీన కవిత్వాన్ని పాండిత్యం, ప్రతిభ కలిగిన వారు చేసే వ్యాఖ్యానం వల్ల ఆ కవిత్వం నిత్యం కొత్త కొత్త సొగబుల్ని అందిస్తుంది.అందుకే ఒక కావ్యంపై వ్యాఖ్యానం వచ్చినా, మళ్ళీ మళ్ళీ కొత్త వ్యాఖ్యానాలు వెలువడుతూ కూడా పాఠకుల్ని అలరింపజేస్తున్నాయి.సీతారాం కవిత్వం కూడా నిత్యం కొత్త అనుభవాన్నిస్తుంది. తాగిన కొద్దీ చెలమలో నీళ్ళు ఊరినట్లే కొత్త భావుకతనేదో అందిస్తుంది.సీతారాం నాకు పూర్తిగా అర్థమయ్యాడని నేను చెప్పలేను. అలాగని అర్థం కాలేదనీ చెప్పలేను.చిన్నపిల్లాడి చిరునవ్వులా, చిన్నపిల్లాడి చేతిలో వెన్నముద్దలా అందీ అందనట్లు, ఇచ్చీ లాక్కున్నట్లు, తీసుకునేలోగా కరిగిపోయినట్లు సీతారాం కవిత్వం నాకనిపించింది. కవిత్వం అంటే స్వచ్ఛత అని అర్థమయ్యింది. కవిత్వమంటే అనుభూతి రమ్యతనివ్వాని తెలిసింది. .... ( ఈ వ్యాసం పూర్తిగా చదవాలనుకున్నవారు ‘సీతారాం సాహిత్యం-విశ్లేషణ వ్యాసాలు’ గ్రంథం, (మే, 2019) సంపాదకుడు: పగిడిపల్లి వెంకటేశ్వర్లు, పగిడిపల్లి కేతన్ చంద్ర, చేతన్ చంద్ర పబ్లికేషన్స్, దెందుకూరు, ఖమ్మం జిల్లా, వారిని సంప్రదించవచ్చు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి