"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 సెప్టెంబర్, 2018

తెలంగాణ ఆత్మగౌరవమే భాష (కాళోజీ 104 జయంతి సందర్భంగా...)

మాట్లాడే భాషనే పుస్తకాల్లో కూడా ఉన్నప్పుడు ఆ భాష సులభంగా అర్థం అవుతుందని ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు.శనివారం నాడు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపి నగర్ లో గల బి.సి. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో  కాళోజీ నారాయణరావు 104వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్  తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సాక్షి దినపత్రిక, 10 సెప్టెంబరు 2018



 స్థానిక భాషా పదాలు నిఘంటువులలో చేర్చకుండా కొన్ని ప్రాంతాల భాషా పదాలను నిఘంటువులో చేర్చటం వలన తెలంగాణ భాష వివక్షకు గురైందని తెలంగాణ ప్రజలు భావించారని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు విద్యార్థులకు ఆహార పదార్థాలను పంపిణీ చేసి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఏర్పాటు, భాషా, సాంస్కృతిక చైతన్యానికి చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. మనం మాట్లాడుకునే భాష లోనే మన మాతృభాష అయిన తెలుగును చదువు కోవడం వలన ఇతర భాషలైన ఆంగ్లం, హిందీ తదితర భాషలను నేర్చుకోవడం వీలవుతుందని రామస్వామి యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గోపాల్, అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, శ్రీను విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి 10 సెప్టెంబరు 2018




1 కామెంట్‌:

బుచికి చెప్పారు...

ఇప్పుడు పత్రికలలో అంతెందుకు మీరు బ్లాగు లో వాడే భాష కూడా ప్రామాణిక భాష. We are fortunate that a standard format has evolved for Telugu which serves as Lingua Franca . Local dialects are good for conversation.