తెలుగు కవులు
ఎవ్వని పద్యంబు యెదలను తాకునో
అదియే రసభరి తమనుకొనియెద
ఎవ్వని భావంబు యెప్పటికీనుండు
అదియేను జీవితమనుకొనియెద
ఎవ్వని లక్ష్యంబు యెప్పుడు తప్పదో
అదియేను లక్షణమనుకొనియెద
ఆ కవి కావ్యంబు అలరారు నిత్యంబు
అదియేను సాహిత్యమనుకొనియెద
నన్నపార్యుడు తిక్కన యెన్నడుండు
ఎఱ్ఱనయ్యయు, పెద్దన, యెంతమంది
యెల్లకాలంబు రంజించు మొల్ల యొకతె
జాషువాలాదిగానుండె జాతికవులు!
-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి