ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు నిర్వహించారు సత్కరిస్తున్న దృశ్యం
విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి మానసిక వికాసంతో ముడిపడి ఉందని నూతన విద్యా విధానం గుర్తించిందని, దాన్ని అని విద్యాలయాలు త్రికరణశుద్ధిగా అమలు చేయాలని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్బోధించారు. సూపర్ విజ్ కళాశాల ఆధ్వర్యంలో బిహెచ్ ఇఎల్ కమ్యూనిటి సెంటర్ లో నూతన విద్యార్థులకు స్వాగతోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ సియు డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు అధ్యక్షత జరిగిన ఈకార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ గౌరవ అతిథిగా పాల్గొని అధ్యాపకులు గుణాత్మకమైన విద్యను అందించాలని, తద్వారా గాంధీజీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, టాగోర్ మొదలైన వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని.మసుకోవాలన్నారు. తమ కళాశాలలో చదువుతోపాటు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. గత యేడాది ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని సభలో సత్కరిస్తున్నామని ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించారు. సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త గొట్టిముక్కల బ్రహ్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు రూపకల్పనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతగినో ఉంటుందని పేర్కొన్నారు. బిహెయిఎల్ కమ్యూనిటి సెంటర్ కార్యదర్శి సురేందర్, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, గురుమూర్తి తదితర అధ్యాపకులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశానంతరం విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి