తెలుగు శాఖ నిర్వహిస్తున్న విశిష్ట ప్రసంగాల్లో భాగంగా బుధవారం (21మార్చి2018) సాయంత్రం సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియం లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి' తెలుగు అధ్యయన ఆవశ్యకత: ప్రస్తుత పరిస్థితులు' అనే అంశంపై మాట్లాడారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆయనను పరిచయం చేస్తూ రాచపాళెం వారి బహుముఖ ప్రజ్ఞ ను వివరించారు. సభాధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ మాట్లాడుతూ రాచపాళెం వారి అధ్యయన విలక్షణతను, ఆనాటి మేధావులతో ఉన్న స్నేహ సౌహార్ధాలను వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ సాహిత్య అధ్యయనం మానవ స్వభావాన్ని, మానవ విలువల్ని అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుందని వ్యాఖ్యానించారు. తెలుగు కవులు నన్నయ, కృష్ణ శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు మొదలైన ప్రాచీన, ఆధునిక కవుల, రచయితల సాహిత్య , సామాజిక పరిణామాలను విశ్లేషించారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం, గురజాడ కన్యాశుల్కం, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఓల్గా మొదలైన రచయితల దృక్పథాలను వివరిస్తూ, దానిలో వ్యక్తమైన సామాజిక పరిణామాలను విశ్లేషించారు. సభకు డా.బాణాల భుజంగ రెడ్డి వందన సమర్పణ చేశారు. సమావేశానికి అత్యధిక సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగార్ని సత్కరిస్తున్న తెలుగుశాఖ సిబ్బంది.
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి ప్రసంగం వింటున్న అధ్యాపకులు, విద్యార్థులు
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారితో ఆచార్య తుమ్మల, ఆచార్య దార్ల, పరిశోధకులు, విద్యార్థులు
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగార్ని పరిచయం చేస్తున్న ఆచార్య దార్ల
ప్రసంగిస్తున్న ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగార్ని పరిచయం చేస్తున్న ఆచార్య దార్ల
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు మాట్లాడుతుండగా వేదికపై ఆచార్య దార్ల
సమావేశానంతరం ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారితో టీ సేవిస్తూ సాహితీ చర్చలు చేస్తున్న ఆచార్య దార్ల, పరిశోధకులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి