కొత్త ఆశలకు ఉగాది ప్రతీకగా నిలుస్తుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సి తెలుగుశాఖలో ఆచార్యుడు, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ( 16 మార్చి 2018) సాయంత్రం హైదరాబాదు, చందానగర్ లోని శ్రీవేంకటేశ్వరరస్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఉగాది కవిసమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.సుమారు 50 మంది కవులు తమ కవితలను వినిపించారు. ఈ కవిసమ్మేళనాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గోల్కొండ సాహితీ సమితి సంయుక్తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగాదికి మన తెలుగు వాళ్ళంతా కొత్త ఉత్సాహంతో పండుగను జరుపుకుంటారనీ, ఈ సందర్భంగా ఉగాది విశిష్టతను వివరించారు. ఉగాదిని పంచవిధుల సమన్వితంగా చేస్తుండటం మన సంప్రదాయం అన్నారు. తైలాభ్యంగనం, (2) నూతన సంవత్సర స్తోత్రం, (3) ఉగాడి పచ్చడి సేవనం, (4) పూర్ణ కుంభదానం, (5) పంచాంగ శ్రవణం అనే అయిదు విధులను నిర్వర్తించడం ఆచారంగా వస్తుందని, అయితే వీటిలో ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం మాత్రం బాగా ఆచరిస్తున్నారని వివరించారు. వీటితో పాటు ఉగాది అనగానే కవిసమ్మేళనాలు జరుగుతుంటాయని చెప్పారు. కవులు పద్యం, వచనం, గేయం ఏ రూపంలో నైనా రాస్తూ, వాటిని ఉగాది నాడు ఆలపించడం ఒక సంప్రదాయంగా వస్తుందన్నారు. సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
1)
అవి భావజాలాల రూపంలో వ్యక్తమవుతుంటాయి. వారి దృష్టి కోణం, వారి అనుభవం, వారి జ్ఞానపరిధులను బట్టి ఆ దృక్పథాలు వెలువడుతుంటాయి. కవిత్వం, వచనమైనా, పద్యమైనా దానిలో కవిత్వం ముఖ్యం. అంతే తప్ప ఆ రూపం ప్రధానం కాదని ఉద్భోధించారు. పద్యం రాయడానికి పాండిత్యం లేదా కనీసావగాహన అవసరమవుతంది. ఛందస్సు, వ్యాకరణం, అలంకారశాస్త్ర పరిచయం అవసరమవుతుంది. వచనంలోనూ ఇవి ఉన్నా, పద్యంతో పోలిస్తే, కొంత స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వచన కవిత్వాన్ని రాసేవాళ్ళు అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేనికైనా సాధన అవసరమైనా, పద్యానికి పాండిత్యం కూడా అవసరం అవుతుందన్నారు. దేన్నీ తక్కువగా చూడకూడదన్నారు. పద్యం, వచనంలాగే కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని వాదించినవాళ్ళున్నారు. నిజానికి కవి మృదు స్వభావుడు, కరుణాంతరంగుడు అయినప్పుడు మానవత్వం, దైవత్వం అతనిలో నిలువెత్తుగా కనిపిస్తుంటాయి. అప్పుడు అతడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సామాజిక ప్రయోజనాన్నే ఆశించేలా కవిత్వాన్ని రాస్తాడని, అయినా, అపారమైన కావ్య సంసారంలో తనకు స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల ప్రజల ప్రయోజనాలను దృష్టి పెట్టుకోవాల
ని కవులను ఉద్భోధించారు. ఈ కార్యమంలో పాల్గొని, కవిత్వం చదివిన, ప్రసంగాలు చేసిన వారందరినీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్, షణికుమార్, రామకృష్ణంరాజు, ఛంద్రప్రకాశ్ రెడ్డి, గంగా మనోహర్ రెడ్డి, అంజయ్య అవధాని, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభలో పాల్గొని కవిత్వం చదివిని అందరికీ దుశ్వాలువా, మెమెంటో, పుష్ఫగుచ్చం, శ్రేవేంకటేశ్వర ప్రసాదం వంటివాటితో ఘనంగా సత్కరించారు.1)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి