హైదరాబాదు, చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలలో ముఖ్యఅతిథిగా సెంట్రల్ యూనివర్సిటి, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, తెలుగు శాఖలో ఆచార్యుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పురోహితుల సమక్షంలో జ్యోతి ప్రజ్వనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గోల్గొండ సాహితీ సమితి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ది 16 మార్చి 2018 , శుక్రవారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగాది ప్రాశస్త్యాన్ని వివరించారు. తర్వాత కవిసమ్మేళనం జరిగింది. కవిసమ్మేళనంలో పాల్గొన్నవారందరినీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు దుశ్శాలువా, జ్ఞాపిక, శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదంతో సత్క రించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ తాడిబోయిన రామస్వామియాదవ్, చంద్రప్రకాశరెడ్డి, గంగామనోహర్ రెడ్డి, రామకృష్ణరాజు, అష్టావధాని అంజయ్య, అశోక్ కుమార్, ఫణికుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ముఖ్యఅతిథి ప్రసంగం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సమావేశంలో పాల్గొన్న సాహితీవేత్తలు, కవులు, ప్రజలు
ఈనాడు 17 మార్చి 2018 నాడు ప్రచురించిన వార్తావిశేషాలు
శంకరాభరణం వాట్సప్ గ్రూపుద్వారా వందలాది మంది పద్యకవులను తయారు చేస్తున్న శ్రీ కంది శంకరయ్య గార్ని సత్కరిస్తున్న జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తదితరులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి