చరిత్రలో భిన్న కోణాలు ఉంటాయి. చరిత్రకారుని దృక్పథం నుండి చరిత్రను రాస్తుంటారు. అందువల్ల చరిత్రలో కొన్ని సార్లు వాస్తవాలు వక్రీకరణకు గురవుతుంటాయి. కానీ, చరిత్రను శాస్త్రీయంగా రాయడానికి శాసనాలు, నాణాలు, భవనాలు, పుస్తకాలు, కైఫీయత్తులతో పాటు సాహిత్యం కూడా ఎంతగానో దోహదం చేస్తుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.
‘‘కాకతీయుల నుండి అసఫ్ జాహీల వరకు తెలంగాణ ( చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) అనే అంశంపై 2018 మార్చి 23, 24 తేదీల్లో జరిగిన జాతీయ సదస్సు రెండవ రోజును ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈయన ‘తెలంగాణ సాంఘిక చరిత్ర’ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు.
సర్వసామాన్యంగా భౌగోళిక చరిత్ర, రాజుల చరిత్రను స్ఫష్టంగా చెప్పడానికి అనేక ఆధారాలు ఉంటాయనీ, కానీ, సాంఘిక చరిత్రను చెప్పడానికి చరిత్రకారుడు విశేషంగా శ్రమించాల్సి ఉంటుందనీ, సాంఘిక చరిత్రకు సాహిత్యం గొప్ప ఆధారంగా నిలుస్తుందన్నారు. వీటితో పాటు శాసనాలు, నాణాలు, వివిధ కట్టడాలు, సమకాలికుల రచనలు, ఇతరభాషల్లో వచ్చిన రచనలు సాంఘిక చరిత్ర నిర్మాణానికి తోడ్పడతాయన్నారు. తెలంగాణాలో కాకతీయుల తర్వాత మరలా అంత ప్రభావితమైన సాంఘిక చరిత్రకు తోడ్పడిన వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వాళ్ళు అసఫ్ జాహీలని వ్యాఖ్యానించారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వెలమలు నిజానికి తెలంగాణాలో పుట్టి పెరగకపోయినా, తెలంగాణాలో స్థిరపడిన తర్వాత, పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణాతో మమేకమైయ్యారనీ, తెలంగాణా వారిగానే శాశ్వతంగా ఉండిపోయారని అన్నారు. అలాగే, అసఫ్ జాహీలు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకపోయినా, ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి తొలుత తమ స్వప్రయోజనాలకోసం కొన్ని భవనాలు కట్టుకున్నా, తర్వాత కాలంలో వాటిలో ఎన్నో భవనాలు ప్రజలకు ఉపయోగకరంగా ప్రభుత్వాలు మార్చాయన్నారు. కాకతీయుల చెరువుల నిర్మాణం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు వంటివన్నీ ప్రజాసంక్షేమం కోసం చేసినవన్నారు. అసఫ్ జాహీలు స్వతంత్రం పొందిన తర్వాత బ్రిటీష్ వారి సహకారంతో విద్యాసంస్థలు, ఆనకట్టలు కట్టారన్నారు.
తెలంగాణాలో బౌద్ధం క్షీణించిన తర్వాత జైనం తీసుకొచ్చిన చైతన్యం వల్ల శైవం, వైష్ణవంలో కులభేదాలు తగ్గడానికి కారణమైందన్నారు. అదే సమయంలో కొత్త కులాల పుట్టకకు కూడా కారణమైందని వివరించారు. పాల్కురికి సోమనాథుడు ప్రజల భాషలో కవిత్వం రాశాడనీ, అలాగే సమకాలీన పరిస్థితులను బట్టి సాహిత్యం వెలువడిందన్నారు. గోనబుద్ధారెడ్డి ద్విపదలో ‘రంగనాథరామాయణం’ రాయడానికి వెనుక వీరశైవంలో ద్విపద ప్రభావం వైష్ణవంపై గాఢంగా చూపించడమేనని అన్నారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పత్రసమర్పణ చేసిన సదస్సుకి ఆచార్య రెడ్డి శ్యామల అధ్యక్షత వహించారు. సదస్సు కన్వీనర్ ఆచార్య జి. అరుణ కుమారి, ఆచార్య రేమెళ్ళ వెంకట రామకృష్ణ శాస్త్రి, డా.పద్మతదితరులు ఆ సమావేశంలో పత్రసమర్పణ చేశారు.
ముగింపు సమావేశానికి ఆచార్య జి. అరుణ కుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య విచ్చేశారు. చక్కగా తెలుగులో మాట్లాడారు. తాను అన్నమయ్య గురించి పరిశోధన చేసినా, ఈ మధ్య కాలంలోనే కాకతీయుల గురించి గ్రంథాన్ని రాశాననీ, చరిత్ర, భాష, సాహిత్యాలతో తనకూ అనుబంధం ఉందని, తెలంగాణా చరిత్ర నిర్మాణానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి, ప్రముఖ వైద్యులు, నాణాల పరిశోధకులు డా. రాజారెడ్డి, సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి డా.ఏనుగుల నరసింహారెడ్డి, సదస్సు కో కన్వీనర్ డా. మల్లెగోడ గంగా ప్రసాద్, చరిత్రపరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి తదితరులు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.
ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై వరుసగా డా. మల్లెగోడ గంగాప్రసాద్, ఆచార్య పి.అలేఖ్య, ఆచార్య జి.అరుణకుమారి, డా.రాజారెడ్డి, డా.నందిని సిధారెడ్డి, డా.ఏనుగుల నరసింహారెడ్డి ఉన్నారు.
కొంతమంది విద్యార్థులు, సాహితీ వేత్తలతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డా. నందిని సిధారెడ్డి, ఆచార్య రేమెళ్ళ వెంకటరామకృష్ణశాస్త్రి, పరిశోధక విద్యార్థి అల్లూరి మస్తాన్ లతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ప్రముఖ పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి, హరగోపాల్, డా.వెంకటేశ్వరశాస్త్రి తదితరులతో ఆచార్య దార్ల
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి గారి నుండి జ్ఞాపిక అందుకుంటున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సభలో పాల్గొన్న పరిశోధకులు, సాహితీ వేత్తలు, విద్యార్థులు, ప్రజలు
పత్ర సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
పత్రసమర్పణ, సమీక్ష చేస్తున్న ఆచార్య జి. అరుణకుమారి గారు
ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
(ఫోటోల సౌజన్యం: మస్తాన్, రామప్రసాద్)
1 కామెంట్:
dear sir very good blog
Telangana Districts News
కామెంట్‌ను పోస్ట్ చేయండి