శ్రీకాశీవిశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవిల గురించి
చిన్పప్పటి నుండీ పుస్తకాల్లో చదువుకున్నాను. కాశీ ఎంతో పవిత్రమైందని అంటారు. ‘కాశతే
ఇతి కాశీ’- అంటే ‘కాశృదీప్తౌ’లో గల ‘కాశృ’ ధాతువుకి ‘ప్రకాశించు’ అనే అర్థం ఉంది.
కాబట్టి, ‘కాశి’ అంటే ‘ప్రకాశించేది’ అని అర్థం చెప్పుకోవచ్చు. కల్పాంత సమయంలో
కూడా నాశనం కాకుండా పరమశివుని త్రిశూలము కొనపై నిలిచి ప్రకాశించేది’ అని వివరణ
చెప్పుకోవచ్చు.
కాశికి
అనేక పేర్లున్నాయి. కాశీ క్షేత్రానికి
తూర్పుదిశలో దక్షిణం నుండి ఉత్తరం వరకు ప్రవహిస్తున్న గంగానదిలో, దక్షిణంలో ‘అసి’
అనే నది, ఉత్తరంలో ‘వరుణ’ అనే నది కలిసిన ప్రాంతం కాబట్టి దీన్ని ‘వారణాసి’ అని
పిలుస్తారు. కాశీకి మరోపేరు ‘ఆనందకావనము’. మనిషి నిజమైన ఆనందాన్ని అనుభవిచే వనముగా
దీన్ని భావిస్తారు. అంటే, శివైక్యం పొందితే జన్మరాహిత్యం కలిగి శాశ్వతమైన ఆనందం
కలిగించే చక్కని తోట వంటిది. దీన్నే ‘మహాశ్మశానం’ అని కూడా పిలుస్తారు. భస్మాన్ని
పూసుకొని భూతాలన్నీ ఇక్కడే నిద్రిస్తాయని చెప్తారు. నిత్యం శవదహనం ఈ పరిసర
ప్రాంతాల్లో ఎక్కడొకచోట అవిచ్ఛనంగా జరుగుతుంది. దీని వల్ల కూడా దీనికి ఈ పేరు
వచ్చింది. దీన్నే ‘రుద్రావాసం’ అని కూడా పిలుస్తారు. రుద్రునికి ఆవాసంగా ఉండటం
వల్ల దీన్ని ‘రుద్రావాసైం’ అంటారు. దీన్నే ‘అవిముక్తం’ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శివుడెప్పుడూ ఈ
ప్రాంతాన్ని విడువక నివసించే ప్రాంతం కావడం వల్ల దీనికి ‘అవిముక్తం’ అని పిలుస్తారు.
ఇలాంటి ‘కాశీ’ని ప్రతి హిందువు దర్శించదగిన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. జీవుడు
‘ముక్తి’ పొందడానికి సరైన క్షేత్రంగా కాశీని తలుస్తారు. ఇక్కడే గంగానది ఉంది.
హిందువులకు ఈ నది ఎంతో పవిత్రమైంది. గంగానది హారతి చూడ్డం జన్మధన్యమైనట్లుగా
భావిస్తారు.
ఇక్కడే కాశీ
హిందూ విశ్వవిద్యాలయం ఉంది. దీన్నే నేడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అంటున్నారు.
దీన్ని 1916లో డా.అనీ బెసెంట్ సహాయంతో మదన్ మోహన్ మాలవ్యా స్థాపించారు. ఈ హిందూ విశ్వవిద్యాలయంలో గల సంస్కృత పండితుల గురించి తెలుగులో ఎంతోమంది
కథలు రాశారు. దళితులను అత్యంత దూరంగా పెట్టడానికి ఈ పండితులెంతగానో తోడ్పడేవారని
కరుణకుమార రాసిన ‘పౌలయ్య కథ’ లాంటి వాటిని చదివితే తెలుస్తుంది. ఇలాంటివెన్నే విశిష్టతలున్న కాశీని చూడాలని,
ముఖ్యంగా కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాలని అనిపించేది.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ఉంది. బోర్డ్
ఆఫ్ స్టడీస్ మెంబరుగా 11.10.2017 నుండి రెండేళ్ళపాటు నాకు అవకాశం కలిపించారు. తొలి
సమావేశం ది.20.02.2018న నిర్వహించారు. నేను కూడా మెంబరుగా పాల్గొనడానికి
అంగీకరించాను. వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ (ఏ.సి) దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్
వచ్చినా చేశాను. కానీ, చివరి వరకు ప్రయత్నించినా కన్ఫర్మ్ కాలేదు. అందువల్ల
ప్రైవేటు ఏజెన్సీకిచ్చి ఏ టికెట్స్ దొరికినా చెయ్యమన్నాను. ప్రైమ్ తాత్కాల్
స్కీములో స్లీపర్ దొరికాయి. నాతో పాటు నా భార్య డా.ఎం.మంజుశ్రీ, మా చిన్నాన్నగారి
అబ్బాయి దార్ల మురళీమనోహర్ రిజర్వేషన్ చేయించుకున్నాం. మాతోపాటు రావడానికి ఎంతో
ఉత్సాహాన్ని చూపిన నా పరిశోధక విద్యార్థి ఎం. చంద్రమౌళిని కూడా తీసుకొని ది.
18.02.2018 ఉదయం 10.00 గంటలకు బయలు దేరే దానాపూర్ ఎక్సప్రెస్ సిద్ధమైయ్యాం.
సాధ్యమైనంతా మా ప్రయాణాన్ని పద్యాల్లో
రాయాలనుకున్నాను. పద్యరచనలో నాకు అంతగా నైపుణ్యంలేదు. కొన్ని లోపాలు ఉండొచ్చు
కూడా. అయినా ఎందుకో పద్యాల్లో రాయాలనిపించింది.
శివుని దర్శనంబు శివమని తలచంగ
ముదము గాను దార్ల, మురళి, మంజు
చంద్ర మౌళి కూడ సంతసమ్మునచేరి
కాశి పయనమునకు కదలినాము!
ముందురాత్రి మంజుశ్రీ ప్రయాణానికి కావలసిన తినుబండారాలన్నీ సమకూర్చింది. నా రీసెర్చ్ స్కాలర్ దారిశెట్టి పుష్పిణి కూడా వచ్చి మంజుశ్రీకి సహాయం చేసింది. మర్నాడు అంటే 18 ఫిబ్రవరి 2018 వతేదీన మరలా ఉదయమే వచ్చి, మమ్మల్ని అందర్నీ లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకూ వచ్చి, ట్రైన్ ఎక్కించింది. తాను కూడా వచ్చి ఉందేదాన్ననీ, మీరే వెళ్తున్నారంతేలే... అంటూ బుంగమూతి పెడుతూ వీడ్కోలు పలికింది.
ముదము గాను దార్ల, మురళి, మంజు
చంద్ర మౌళి కూడ సంతసమ్మునచేరి
కాశి పయనమునకు కదలినాము!
ముందురాత్రి మంజుశ్రీ ప్రయాణానికి కావలసిన తినుబండారాలన్నీ సమకూర్చింది. నా రీసెర్చ్ స్కాలర్ దారిశెట్టి పుష్పిణి కూడా వచ్చి మంజుశ్రీకి సహాయం చేసింది. మర్నాడు అంటే 18 ఫిబ్రవరి 2018 వతేదీన మరలా ఉదయమే వచ్చి, మమ్మల్ని అందర్నీ లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకూ వచ్చి, ట్రైన్ ఎక్కించింది. తాను కూడా వచ్చి ఉందేదాన్ననీ, మీరే వెళ్తున్నారంతేలే... అంటూ బుంగమూతి పెడుతూ వీడ్కోలు పలికింది.
కాశీ బయలు దేరిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.ఎం.మంజుశ్రీ, దార్ల మురళీమనోహర్, ఎం.చంద్రమౌళిలను ట్రైన్ ఎక్కించి వీడ్కోలు పలుకుతున్న దారిశెట్టి పుష్ఫిణి.
కాశీ బయలు దేరిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.ఎం.మంజుశ్రీ, దార్ల మురళీమనోహర్, ఎం.చంద్రమౌళి
అక్కడ నుండి సికింద్రాబాద్ వెళ్ళేలోగా ఒక పద్యం
రాయాలనిపించింది.
దారి శెట్టిపుష్పిణి తినదగినవన్ని
మంజుతోకలిసిబ్యాగునందునుంచి
ముడిని వేయ బహ్మతరమ్ము ముడిని విప్ప
ఎక్కినాము దానా యెక్సు ప్రెస్సురైలు
మంజుతోకలిసిబ్యాగునందునుంచి
ముడిని వేయ బహ్మతరమ్ము ముడిని విప్ప
ఎక్కినాము దానా యెక్సు ప్రెస్సురైలు
కాశీ వెళ్ళడానికి సికింద్రాబాద్ నుండి ఒకటే
ట్రైన్ ఉంది. విమానం పై వెళ్దామంటే మంజుశ్రీ భయమని ఒప్పుకోలేదు. తప్పనిసరి
పరిస్థితుల్లో రైలుపైనే వెళ్ళవలసి వచ్చింది. సికింద్రాబాద్ రైల్పేస్టేషన్ లో రైలు
ఎక్కడానికి ఎదురుచూస్తున్న ప్రయాణికుల్ని చూస్తే ఆశ్చర్యమేసింది. ఫ్లాట్ ఫారమ్
అంతా కిటకిటలాడింది. ఇసుకపోస్తే రాలనంత జనమంటే ఎలాగుంటారో చూశాను. మా బోగీలో
ప్రవేశించడమే చాలా కష్టమైంది. ఎలాగోలా బోగీలోకి వెళ్లాం. కానీ, మాసీట్లు మాకు
రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అదేంటో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవాళ్ళు,
ఆర్. ఎ.సి. వాళ్ళు, జనరల్ వాళ్ళు, టికెట్ లేని వాళ్ళు... ఇలా ఒక్కరకమేంటి అన్ని
రకాల వాళ్ళూ తమకి నచ్చిన చోటులో కూర్చొన్నారు. చెబితే వినడంలేదు. దానికి తగ్గట్టు
వాళ్ళతో పాటు తెచ్చుకున్న సామాన్లను భారీగానే ఉన్నాయి. ఎలాగోలా కూర్చొనే చోటు దొరికింది.
మంజు పరిస్థితి చూడాలి. ‘‘ఏమిటిరా బాబూ... ఈ పరిస్థితి’’ అన్నట్లే ఆమె ముఖం
అనిపించింది. నాకేమో విమానం ఎక్కనన్నందుకు కోపం వచ్చింది. విసుక్కున్నాను. ఇకపై
మీరే వెళ్దురుగానిలే... మీకు నచ్చిన విమానమే ఎక్కిదిరిగానిలే...’’ అంటూ ముఖం
ముడుచుకుంది. చాలాసేపు ఇద్దరి మధ్యా మౌనం. మా బోగీలో సీటు దొరకని చంద్రమౌళి తన
బోగీని చూడ్డానికి వెళ్లాడు. అక్కడ కూడా పరిస్థితి భయంకరంగా ఉందన్నాడు. మరలా మా
దగ్గరకే వచ్చేసాడు. మరలా మంజుని మామాలు స్థితికి తీసుకురావడానికి మేమంతా అనేక
విధాలా ప్రయత్నించాం. రైలు నెమ్మదిగా కాదులే, స్పీడుగానే పోతోంది. నేను నెమ్మదిగా
పైన ఒక సీటు సంపాదించుకొని ఎక్కి కూర్చొన్నాను. ఈ పరిస్థితిని ఒక పద్యంలో రాస్తే
ఎలా ఉంటుందనిపించింది.
పోవద్దుర 'దానా' పై
రావద్దురదాని నుండు రాక్షస మూకల్
రావచ్చునురా సీటును
పోవచ్చునదేను సీటు పోరుసలపగన్
రావద్దురదాని నుండు రాక్షస మూకల్
రావచ్చునురా సీటును
పోవచ్చునదేను సీటు పోరుసలపగన్
(దార్ల కాశీయాత్ర: భాగం -1)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి