పొడిచిన చోటును విడువక
పొడుచుట కెంతగ పొదుపును పొందుకచేయన్
జడవక తప్పదు సూదికి
నడవగ దేహము షుగరుకు నడుపుము దార్లా!
పొడుచుట కెంతగ పొదుపును పొందుకచేయన్
జడవక తప్పదు సూదికి
నడవగ దేహము షుగరుకు నడుపుము దార్లా!
అపుడే సలుపును నరములు
అపుడే కెరటము లెగియును ఆనందముగన్
ఎపుడే మగునో దేహము
చెపుటే కష్టము షుగరుకు! చెప్పుము దార్లా!
అపుడే కెరటము లెగియును ఆనందముగన్
ఎపుడే మగునో దేహము
చెపుటే కష్టము షుగరుకు! చెప్పుము దార్లా!
ఒంటికి సుఖంబు నోనో
కంటికి నిదురయు నహీ! సకలహితులు నొకే
యింటిని రుచిగా చేసిన
వంటల నేదియును చూడ వలదను దార్లా!
కంటికి నిదురయు నహీ! సకలహితులు నొకే
యింటిని రుచిగా చేసిన
వంటల నేదియును చూడ వలదను దార్లా!
-దార్ల
వెంకటేశ్వరరావు
హైదరాబాదు
( ఈ పద్యాలు 13 ఫిబ్రవరి 2018 వతేదీన గణేష్ దినపత్రికలో ప్రచురితం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి