మొన్న
మావాళ్లు పొందిన క్లింటన్ మృదుస్ఫర్శనింకా
మరిచిపోలేకపోకుండానే
‘ఇవాంకా’ నువ్వొస్తున్నావు
నువ్వేమి తెస్తావో మాకు తెలీదు
నువ్వేమిస్తావో మాకు తెలీదు
నగరమిప్పుడు ఎగిసిపడే ఆనంద కెరటమవుతోంది
నగరమిప్పుడు వసంతకాల పూదోటవుతోంది
నగరమంతా రెడ్ కార్పెట్ల స్వాగతమవుతోంది
మూసీ పండినంత సంబరంగా
అధికారుల ప్రేమంతా బిచ్చగాళ్ళమీదే ప్రవహిస్తోంది
మాకిప్పుడు అద్దాలవసరంలేదేమో
హైదరాబాదు రోడ్లమీదే ముఖాల్ని చూసుకొనేలామారిపోతున్నాయి.

ఓట్లేయించుకున్న
మా ప్రజాప్రతినిధులకెన్ని విన్నపాలు చేసుకున్నా
ఒక్కగొయ్యి కూడా పూడ్చలేనివాళ్ళంతా అన్నీ అలికిముగ్గులేస్తుంటే
ఒక్కగొయ్యి కూడా పూడ్చలేనివాళ్ళంతా అన్నీ అలికిముగ్గులేస్తుంటే
సంక్రాంతి
ముగ్గులే సిన్నబోతున్నాయి!
అడక్కుండానే నిధులన్నో వరదలకు కొట్టుకొచ్చే చేపలవుతున్నాయి
అడక్కుండానే నిధులన్నో వరదలకు కొట్టుకొచ్చే చేపలవుతున్నాయి
మళ్ళీ
నువ్వెన్నాళ్ళకొస్తావో ఇవాంకా
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
ఏదోవంకతో
ముచ్చటగా రావాలనిపిస్తోంది
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
ఇవాంకా!
నీకు తెలుసా నీభద్రత కోసమే మావాళ్లు
ఆకాశంలో
దాగిన మబ్బుల్ని కూడా ఎలా గాలిస్తున్నారో !
ఇవాంకా! నీకు తెలుసా నీభద్రతకోసమే మా వాళ్ళు
అణువణువునా ఎలా నైపుణ్యంతో శోధిస్తున్నారో!
కుక్కల్నీ, కోడి పిల్లల్నీ కూడా సీసీ కెమారాలెంత అందంగా చిత్రిస్తున్నాయో!
గోకుల్ చాట్ సెంటర్లో, నెక్లెస్ రోడ్ కూడళ్ళలో
చార్మినార్ సాక్షి గా పాత బస్తీల్లోనే కాదు దేశమంతా నువ్వే

ఏ
ఛానెల్లో చూసినా నీ బొమ్మలే
ఏ
పత్రికలు రాసినా నీ రాతలే ఎక్కడ చూసినా నీ ముచ్చట్లే!
నీతో
పాటే నువ్వు తినేవన్నీ వండించుకున్న రుచుల ఘుమఘుమలు
మా ఫలక్ నామా ప్యాలస్ లో నూటొక్కరకాలవంటగాళ్ళకే తెలీదు!
నూలు పోగు తేడారాకుండా కళ్ళకు బూతద్దాలు పెట్టుకొని మరీ
పొదుగుతున్న పోచంపల్లి పట్టుచీరతో
మాతెలుగుతనాన్ని నీలో చూడాలని కళ్ళెంతగా ఆశపడుతున్నాయో!
లాడ్ బజార్లో గాజులన్నీ నీకోసమే మెరుపులకే మెరుపులద్దుకొన్న
కొత్త పెళ్లి కూతుళ్ళలా సిద్ధమవుతున్నాయి
నీమేను మెరుపులతో పోటీపడుతూ నీతో బతకమ్మనాడాలని
తంగెడు పూలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి
మా ఫలక్ నామా ప్యాలస్ లో నూటొక్కరకాలవంటగాళ్ళకే తెలీదు!
నూలు పోగు తేడారాకుండా కళ్ళకు బూతద్దాలు పెట్టుకొని మరీ
పొదుగుతున్న పోచంపల్లి పట్టుచీరతో
మాతెలుగుతనాన్ని నీలో చూడాలని కళ్ళెంతగా ఆశపడుతున్నాయో!
లాడ్ బజార్లో గాజులన్నీ నీకోసమే మెరుపులకే మెరుపులద్దుకొన్న
కొత్త పెళ్లి కూతుళ్ళలా సిద్ధమవుతున్నాయి
నీమేను మెరుపులతో పోటీపడుతూ నీతో బతకమ్మనాడాలని
తంగెడు పూలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి
మళ్ళీ
నువ్వెన్నాళ్ళకొస్తావో ఇవాంకా
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
ఏదోవంకతో
ముచ్చటగా రావాలనిపిస్తోంది
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
-దార్ల వెంకటేశ్వరరావు
24 నవంబర్ 2017
( అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నవంబర్
28, 29 తేదీల్లో హైదరాబాదులో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర
సమావేశం లో పాల్గొనడానికి వస్తున్న సందర్భంలో జరుగుతున్న ఏర్పాట్లకు స్పందించి...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి