Saturday, January 06, 2018

ఆ తీరంపై దాడి చేసిందెవ్వరు?

 December 2017 Andhra Pradesh Monthly 

మనం గువ్వలేరుకుంటూ
మనసులేవో గుసగుసలాడుకున్నవన్నీ 
నురగ నురగలుగా తేలిపోతున్నాయిలా??
నువ్వూ నేనూ గువ్వల్లా 
పెట్టుకున్న సంతకాలన్నీ 
కెరటాల్లో కొట్టుకుపోతున్నాయిలా??
నువ్వూ నేనూ 
ఆడుతూ పాడుతూ కట్టుకున్న 
శైకతభవనాలన్నీ కూలిపోతున్నాయిలా??

మన మనో తీరంపై వాలిన శతృబీభత్సాన్నాపేదెలా?
మళ్ళీ మనం మల్లెలసౌరభాలయ్యేదెలా?
ఒకటా రెండా మూడా ... ఎన్ని సార్లు
ఆ కెరటాలే ఓడిపోయాయి
ఈ వడగళ్ళ బురదజల్లులేమిచేస్తాయిలే
కడిగిన ముత్యాలై మళ్ళీ మెరుద్దాంలే!!
-
దార్ల

No comments: