పొద్దుట్నుండీ
ప్రదర్శన చూడ్డానికొచ్చిన ప్రతీవాళ్ళూ
నన్ను పొగిడేవాళ్ళే!
జీవం ఉట్టిపడుతుందంటూ
నన్ను సుకుమారంగా గిల్లేవాళ్ళే!
చేతిలోని కంచం చూస్తూ
ఆకలేస్తుందేమోనని
దానిలో కొన్ని జోకులేసేవాళ్ళే!
తెల్లారింది...
మధ్యాహ్నమైంది...
రాత్రయ్యింది ...!
ఎన్నాళ్ళిలా వాళ్ళాస్వాదనకో సాధనమవ్వాలి?
ఎన్నాళ్ళిలా శిలగానే ఇలలో మిగిలిపోవాలి?
ఎన్నాళ్ళిలా నాలో నేనే సంఘర్షణ పడాలి?
మానవులెంతగా మారిపోయారు!
గుడిలో కొబ్బరికాయ కొడతారు
దేవుడికని నైవేద్యం పెడతారు
ఆ దేవుడొచ్చి కొబ్బరికాయతినేస్తే?
ఆ దేవతలే దిగొచ్చి నైవేద్యాన్నారగించేస్తే?
ఈ గుళ్ళు కట్టేవారా? ఈ పూజలు చేసేవారా?
దైవం చుట్టూ అంత తత్వం చేరేదా?
సర్వం జీవమయం...జీవం సర్వం దైవమయం...
మరి ఈ శిల్పంగా ఉన్న నేనెర్ని?
రోజూలాగే ప్రదర్శనశాలను మూసేస్తున్నారు.
రోజూలాగే సందర్శకుల సంతోషాల్ని కడిగేస్తున్నారు
రోజూలాగే సందర్శకుల మూతి వంకర్లనీ మూలకు నెట్టేస్తున్నారు
ఇన్నిహృదయ స్పర్శలానంతరం
ఇన్ని చిక్కకున్న చూపులానంతరం
ఇక్కడెలా ఉండగలను!
నీ దగ్గరకే వచ్చేస్తున్నా
పాతుకుపోయిన నేలను పెళ్ళగించుకొంటూ
ముక్కలైపోతున్న ఆశల్ని అతికించుకొంటూ
నీకోసమే వచ్చేస్తున్నా...
నీలో నేను చేరడం కోసం నేనేమైనా నాకిష్టమే!!
-దార్ల వెంకటేశ్వరరావు
ప్రదర్శన చూడ్డానికొచ్చిన ప్రతీవాళ్ళూ
నన్ను పొగిడేవాళ్ళే!
జీవం ఉట్టిపడుతుందంటూ
నన్ను సుకుమారంగా గిల్లేవాళ్ళే!
చేతిలోని కంచం చూస్తూ
ఆకలేస్తుందేమోనని
దానిలో కొన్ని జోకులేసేవాళ్ళే!
తెల్లారింది...
మధ్యాహ్నమైంది...
రాత్రయ్యింది ...!
ఎన్నాళ్ళిలా వాళ్ళాస్వాదనకో సాధనమవ్వాలి?
ఎన్నాళ్ళిలా శిలగానే ఇలలో మిగిలిపోవాలి?
ఎన్నాళ్ళిలా నాలో నేనే సంఘర్షణ పడాలి?
మానవులెంతగా మారిపోయారు!
గుడిలో కొబ్బరికాయ కొడతారు
దేవుడికని నైవేద్యం పెడతారు
ఆ దేవుడొచ్చి కొబ్బరికాయతినేస్తే?
ఆ దేవతలే దిగొచ్చి నైవేద్యాన్నారగించేస్తే?
ఈ గుళ్ళు కట్టేవారా? ఈ పూజలు చేసేవారా?
దైవం చుట్టూ అంత తత్వం చేరేదా?
సర్వం జీవమయం...జీవం సర్వం దైవమయం...
మరి ఈ శిల్పంగా ఉన్న నేనెర్ని?
రోజూలాగే ప్రదర్శనశాలను మూసేస్తున్నారు.
రోజూలాగే సందర్శకుల సంతోషాల్ని కడిగేస్తున్నారు
రోజూలాగే సందర్శకుల మూతి వంకర్లనీ మూలకు నెట్టేస్తున్నారు
ఇన్నిహృదయ స్పర్శలానంతరం
ఇన్ని చిక్కకున్న చూపులానంతరం
ఇక్కడెలా ఉండగలను!
నీ దగ్గరకే వచ్చేస్తున్నా
పాతుకుపోయిన నేలను పెళ్ళగించుకొంటూ
ముక్కలైపోతున్న ఆశల్ని అతికించుకొంటూ
నీకోసమే వచ్చేస్తున్నా...
నీలో నేను చేరడం కోసం నేనేమైనా నాకిష్టమే!!
-దార్ల వెంకటేశ్వరరావు
(ఎగ్జిబిషన్ నుండి శిల్పం బయటకు పారిపోతూ కూలిపోయి ముక్కముక్కలైపోయినట్లున్న
ఒక వీడియో చూసిన స్పందనలో...!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి