"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

06 జనవరి, 2018

ఈ వెలుతుర్ని మింగేస్తున్నదెవరు?


ఇప్పుడిప్పుడే 
జీవితం అంకురమవుతున్న  
ఈ నేలను తవ్వేస్తున్నదెవరు?
ఆ సముద్రాల్ని ఈ కళ్ళనిండా
గడ్డ కట్టించి మరీ ప్రవహిస్తున్నదెవరు?

ఆ చీకట్నంతా ఈ మనసు ముంగిట్లో
అలా గుట్టలు గుట్టలుగా పోస్తున్నదెవరు?
ఈ మనోమైదానంలోని ఆ పులకాంకురాల్ని
బలవంతంగా ఎత్తుకుపోతున్నదెవరు?
ఆ వేణువునలా గాయం చేసి
ఇలా కీచురాళ్ళను విసురుతున్నదెవరు?
ఈ పూలతోటలన్నీ కూకటి వేళ్ళతో పెకలించేస్తూ
అలా నాగజెముళ్ళను పాతేస్తున్నదెవరు?
ఈ నవ్యోత్సవ సుప్రభాతంపై
ఇలా ఉక్కుదుప్పట్లను కప్పేస్తున్నదెవరు?
-వి.ఆర్. దార్ల
7-9-2017

(సాక్షి సాహిత్యం పుట 20 నవంబరు 2017 )

కామెంట్‌లు లేవు: