కూల్ ఇన్ ఇండియా!
సంకనెక్కిన
చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
దేహమంతా మెల్లమెల్గగా ఆక్రమిస్తూ
దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా
నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ
జనాల్నంతా మత్తునేదో జల్లుకుంటూ
దుప్పట్లేదో ముసుగులేస్తూ
నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా!
సంకనెక్కిన చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
కళ్ళెదుటే దృశ్యాలేవో కదులుతున్ళా
ఇంటిపక్కనే కేకలేవో వినపడుతున్నా
రంగురంగుల టీవీల్లో స్ఫష్టంగా చూద్దామనో
హోమ్ థియేటర్ బాక్సుల్లో విస్ఫష్టంగా విందామనో
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
దేహమంతా మెల్లమెల్గగా ఆక్రమిస్తూ
దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా
నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ
జనాల్నంతా మత్తునేదో జల్లుకుంటూ
దుప్పట్లేదో ముసుగులేస్తూ
నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా!
సంకనెక్కిన చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
కళ్ళెదుటే దృశ్యాలేవో కదులుతున్ళా
ఇంటిపక్కనే కేకలేవో వినపడుతున్నా
రంగురంగుల టీవీల్లో స్ఫష్టంగా చూద్దామనో
హోమ్ థియేటర్ బాక్సుల్లో విస్ఫష్టంగా విందామనో
అనిపిస్తుందేమిటిలా!
మనం కన్నవే, మనం విన్నవే
వింతవింతగా మీడిమాలో
మెదులుతున్నాయ్యేమిటిలా?
సంకనెక్కిన చలిప్పుడు
మునివేళ్ళ స్ఫర్శానుబంధమై
నెచ్చెలి కంటే నాకునులి వెచ్చనయ్యింది
నెట్టింటలో పొట్టి పలుకు చాలు
బతుకంతా ప్లాస్టిక్ మనీ నేస్తమయ్యింది !
నాది తెలిసినట్లుండే అతి తెలివిడి తనమో
నాది గడ్డ కట్టిన ఒంటరి కలివిడి తనమో
నాది బలిసిన బద్దకమో
నాది తలకెక్కిన మధమో
నా దేహమంతా సోకిన జ్వరమో
నాకప్పుడేమీ తెలియలేదు !
జేబుల్నుండి విత్తులన్నీ
చిట్టెలుకలేవో కొట్టేస్తున్నాయని
పొట్టి పలుకులు మొత్తుకున్నా మిన్నకున్నాను
నన్ను ఆకాశాన్నందుకునే
నిగ్రహానికే విగ్రహమేదో చేశారనుకున్నాను
నాకింతవరకూ
రక్షణ కవచమన్న
బ్యాంకుల్లోని దుప్పట్లన్నీ
కొరికేసే పందికొక్కుల చుట్టాలొస్తున్నారు
నాకిప్పుడిప్పడే
వెన్నులోవణుకు బెణుకులేవో పుట్టకొస్తున్నాయి
నాకిప్పుడిప్పడే
వైట్ హౌస్ హారనేదో మెల్లమెల్లగా వినిపిస్తోంది!
నాకిప్పుడిప్పడే
మీడియా చూపని బొమ్మలేవో
కళ్ళెదుటే బెదురుబెదురుగా కదులుతున్నాయి
నాకిప్పుడిప్పడే
పెయిడ్ కాని అక్షరమేదో
నేలకింద పిడికిళ్ళై పలకరిస్తోంది
బ్యాంకుల్లోని దుప్పట్లన్నీ
కొరికేసే పందికొక్కుల చుట్టాలొస్తున్నారు
నాకిప్పుడిప్పడే
వెన్నులోవణుకు బెణుకులేవో పుట్టకొస్తున్నాయి
నాకిప్పుడిప్పడే
వైట్ హౌస్ హారనేదో మెల్లమెల్లగా వినిపిస్తోంది!
నాకిప్పుడిప్పడే
మీడియా చూపని బొమ్మలేవో
కళ్ళెదుటే బెదురుబెదురుగా కదులుతున్నాయి
నాకిప్పుడిప్పడే
పెయిడ్ కాని అక్షరమేదో
నేలకింద పిడికిళ్ళై పలకరిస్తోంది
సంకనెక్కిన చలి
వదిలే దాకా
ఋతువులెప్పుడు మారతాయోనని
ఎదురుచూస్తూ
సూర్యకిరణం తాకుకుంటూ
అంబేడ్కర్ - మార్క్స్ మార్గ్ వరకూ
అరిస్టాటిల్ సైకిలెక్కి పిక్కలరిగేలా తొక్కవలసిందే!
అంతవరకూ దేశమంతా చుట్టుతున్న
దేహమంతా పిండి పిండి చేస్తూ ఉన్నా
సంకనెక్కిన చలికి
ఋతువులెప్పుడు మారతాయోనని
ఎదురుచూస్తూ
సూర్యకిరణం తాకుకుంటూ
అంబేడ్కర్ - మార్క్స్ మార్గ్ వరకూ
అరిస్టాటిల్ సైకిలెక్కి పిక్కలరిగేలా తొక్కవలసిందే!
అంతవరకూ దేశమంతా చుట్టుతున్న
దేహమంతా పిండి పిండి చేస్తూ ఉన్నా
సంకనెక్కిన చలికి
నువ్వూ నేనూ వంగి
వంగి మొక్కవలసిందే!
-దార్ల
వెంకటేశ్వరరావు
27.12.2017
మొబైల్: 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి