శ్రీ త్యాగరాయ గానసభ, హైదరాబాదులో గత నెల బుధవారం (27.12.2017 ) విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రముఖకవులతో అతిరథకవుల అరుదైన కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి మాట్లాడుతూ పరిణతి చెందేకొద్దీ చిక్కదనంతో పాటు, బలమైన అభివ్యక్తితో కవిత్వం వస్తుందన్నారు. కవిత్వంలో అనవసరమైన శబ్దాలు తగ్గడం వల్ల తక్కువ నిడివితోనే మంచి కవిత్వాన్ని వర్ణించవచ్చునన్నారు. నిజమైన కవికి వస్తువు కోసం ప్రాకులాడవలసిన పనిలేదనీ, తన చుట్టూ ఉన్న సమాజమే నిజమైన వస్తువు అని పేర్కొన్నారు. అయితే కవిత్వానికి వస్తువే ముఖ్యమని గుర్తించాలని హితబోధ చేశారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న కె.శివారెడ్డి, బైస దేవదాస్, నిఖిలేశ్వర్, జల్డి విద్యాధరరావు, రమణ వెలమకన్ని, వెంకటదాసు తదితరులు
సభలో మాట్లాడుతున్న బైస దేవదాస్
అతిధులుగా పాల్గొన్న నేటి నిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైస దేవదాస్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న తర్వాత కవులమని చెప్పుకునేవాళ్ళు చేసే పనులు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయనీ, తన కవిత కాకపోయినా తనకు డబ్బులిస్తుంటే కవిత్వం చదవడానికి ఎగబడ్డం చూశానని, అకవులు ఎంతో మంది కవులుగా చెలామణి అయ్యారని, కానీ ఈ కవి సమ్మేళనంలో అందరూ కవిత్వం కోసమే వచ్చిన కవులని ప్రశంసించారు. ఈ కవిసమ్మేళనంలో ప్రతి కవి సామాజిక బాధ్యతతో కవిత్వం రాసినవాళ్లేనని వ్యాఖ్యానించారు.
కవిత్వం వింటున్న ప్రముఖ కవులు, శ్రోతలు
దిగంబర
కవుల్లో ఒకరైన ప్రముఖకవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ కవికి సామాజిక స్పృహ ఎంతో ముఖ్యమన్నారు.
సభకు రమణ వెలమకన్ని అధ్యక్షత వహించగా, ప్రముఖ కవి పెద్దూరి వెంకటదాసు కవిసమ్మేళనం
నిర్వహించారు. విమల సాహితీ సమితి ఆధ్యక్షుడు ప్రముఖ కవి జెల్డి విద్యాధరరావు సభకు
స్వాగతం పలికారు.కవిసమ్మేళనంలో ప్రముఖ కవులు సుగుమ్ బాబు, ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు, ఆశారాజు, డా. ప్రసాదమూర్తి, డా.బిక్కి కృష్ణ, డా. చిల్లర
గంగాభవాని, శ్రీమతి శైలజామిత్ర, డా.ఏనుగు నరసింహారెడ్డి, మౌనశ్రీ మల్లిక్ తదితరులు
కవిత్వాన్ని చదివి వినిపించారు. సభల్లో పాల్గొన్న వారిని, కవులను విమల సాహితీ
సమితి అధ్యక్షుడు కవి, జెల్డి విద్యాధరరావు, శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షుడు శ్రీ
కళా.వి.జనార్థనమూర్తి సంయుక్తంగా సత్కరించారు.
శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017 తేదీన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదువుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017 తేదీన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని వింటున్న కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైసా దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర కవులు.
శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017 వతేదీన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదివిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైస దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర కవులు.
కవి సమ్మేళనం కరపత్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి