మన చుట్టూ ఉన్న పరిసరాలే మన ఆరోగ్యాన్ని, మన జీవన ప్రమాణాల్ని నిర్దేశిస్తాయని స్వచ్ఛతా పక్షోత్సవ చైర్మన్ దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ గృహకల్ప కాలనీల్లో శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్యం గురించి ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వీరితో పాటు పరిశోధక విద్యార్థులు డా.నూనావత్ రాంబాబు,విశాల్,యోగేష్, సతీష్ శ్రీధర్, ఉమేశ్ , రాంప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. వార్డు మెంబర్ శ్రీకళ ఈ వార్డుల్లో జరిగే పారాశుధ్య కార్యక్రమాల్ని వివరించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిసరాల్లోని మురికి వాడల్లో ఈ కార్యక్రమాలు వరుసగా నాలుగు రోజులపాటు జరుగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి