నాణ్యమైన సరుకుల్ని విద్యార్ధులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని, యూనివర్సిటీ నిర్దేశించిన నియమావళి దృష్టిలో పెట్టుకోవాలని డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ యూనియన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్బోధించారు. శుక్రవారం నాడు యూనివర్సిటీ క్యాంపస్ లోని కొత్తగా ఏర్పరిచిన సూపర్ మార్కెట్ నీ ఆయన ప్రారంభించారు.
గత కొన్నాళ్లుగా యూనివర్సిటీ క్యాంపస్ లో కొన్ని సూపర్ మార్కెట్లను మూసేశారు. కాలం తీరిన (ఎక్పైర్) అయిన వస్తువుల్ని అమ్ముతుండటం వల్ల స్టూడెంట్స్ యూనియన్, యూనివర్సిటీ అధికారులు కొన్ని షాపులను మూసేశారు. తర్వాత మరలా టెండర్లు పిలిచారు. ఆ కమిటీకి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరించారు. ఆ కమిటీలో యూనివర్సిటీ వివిధ విభాగాలకు చెందిన వాళ్లు సభ్యులు గా ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి