"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 September, 2017

పరిసరాల పరిశుభ్రత ఒక నిరంతర ప్రక్రియగా మారాలి

‘‘పరిసరాల పరిశుభ్రత అనేది ఒక రోజులో పూర్తయ్యే కార్యక్రమం కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. భారత ప్రభుత్వం వారి మార్గదర్శకాలు ఆధారంగా మనం ఈ కార్యమాన్ని ప్రారంభిస్తున్నాం. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ ఉంది. దీనివల్ల నిరంతరం పరిసరాల పరిశుభ్రత మరింత వేగవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ కొన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ సమస్య అవుతుంది. వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల’’ని హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావు  ప్రబోధించారు.
  హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో శనివారం (2 సెప్టెంబరు 2017) స్వచ్ఛతా పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, కేంద్ర మాన వనరుల శాఖ, మరికొన్ని శాఖల సంయుక్త  మార్గదర్శకాలను అనుసరించి ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు చైతన్యాన్ని తీసుకొస్తుందని,దీనికి అనుగుణంగా కార్యక్రమాల్ని రూపొందించారని వైస్ ఛాన్సలర్ వివరించారు. 
స్వచ్ఛతా పక్షోత్సవాల కార్యక్రమాల పోస్టర్ ని విడుదల చేస్తున్న వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు, ప్రొ- వైస్-ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, డీన్. స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్పేర్ & చైర్మన్, స్వచ్ఛతా పక్వాడా కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డా.పద్మజ, ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డా.వి.శ్రీనివాసరావు, డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. రాజశేఖర్, అసిస్టెంటు రిజిస్ట్రార్స్ శ్రీ సుధాకర్, శ్రీ చంద్రశేఖర్, మరికొంతమంది ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు చిత్రంలో ఉన్నారు. 
తొలిరోజున యూనివర్సిటీ మెయిన్ గేట్ నుండి జ్యోతి బాపూలే ఆడిటోరియం వరకు క్యాంపస్ క్లీనింగ్ కార్యక్రమంతోపాటు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావు ముఖ్య అతిథి పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా  ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, డి.ఎస్.డబ్ల్యూ ఆచార్య దేవాశిస్ ఆచార్య, స్వచ్ఛతా పక్షోత్సవాల కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, Dy.DSw డా.పద్మజ, అసిస్టెంట్ రిజిస్టార్్సశ్రీ సుధాకర్, శ్రీ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాజశేఖర్, ఫ్యాకల్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతా పక్షోత్సవాల్ని ప్రారంభించిన వైస్ -ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు తదితరులు. 

స్వచ్ఛతా పక్షోత్సవంలో పాల్గొని చెత్తను ఊడ్చి క్యాంపస్ ని శుభ్రం చేస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు

స్వచ్ఛతా పక్షోత్సవం ఆశయాల్ని, లక్ష్యాల్ని వివరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

స్వచ్ఛతా పక్షోత్సవం ఆశయాల్ని, లక్ష్యాల్ని వివరిస్తున్న డా. పద్మజ గారు.

క్యాంపస్ లో ఊడ్చిన చెత్తను ఒక విద్యార్థి సహాయంతో పారబోయడానికి తీసుకెళ్తున్న డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య 

చెత్తను శుభ్రం చేస్తున్న పరిశోధక విద్యార్థులు

చెత్తను శుభ్రం చేస్తున్న పరిశోధక విద్యార్థులు

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది

చెత్తను శుభ్రం చేస్తున్న మరికొంతమంది విద్యార్థులు. పరిశోధక విద్యార్థులు


కార్యక్రమాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్న దృశ్యం

చెత్తను శుభ్రం చేస్తున్న మరికొంతమంది విద్యార్థులు.


చెత్తను లారీలోకి పోయడానికి సిద్ధమవుతున్న దృశ్యం 

మరీ నిమగ్నమైపోయి చెత్తను తుడిచేస్తున్న ఒక పరిశోధక విద్యార్థిని




No comments: