రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యూనివర్సిటి హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా డా.దార్ల

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీ కి  ఫ్రొఫెసర్ గీత.కె.వేముగంటి, డీన్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గారు చైర్మన్ గాను, వైస్-చైర్మన్ గా డా.దార్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలుగు, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ గార్ని   నియమిస్తూ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్  వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకుంటూ 25 ఏప్రిల్ 2017 ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ పి.సర్దార్ సింగ్  2 మే 2017న ఉత్తర్వులను జారీచేశారు. ఈ కమిటి రెండు సంవత్సరాలపాటు యూనివర్సిటి హెల్త్ సెంటర్ కి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను సమీక్షిస్తుంది.

No comments: