ప్రముఖ పరిశోధకుడు, విమర్శకుడు, ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన ‘‘సాహిత్య పరిశోధనా కళ: విధానం’’ పుస్తకావిష్కరణ సభ 10 ఏప్రిల్ 2017, సాయంత్రం : 4-00 గంటలకు హైదరాబాదు విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటి) హైదరాబాదులో జరుగుతుంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మాజీ వైస్ ఛాన్సలర్ డా.ఆవుల మంజులతగారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ‘‘తెలుగు సాహిత్య పరిశోధన-తీరుతెన్నులు’’ గురించి ఆచార్య మంజులత ప్రత్యేకప్రసంగాన్ని చేస్తారు. సభకు తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణగారు అధ్యక్షత వహిస్తారు. పుస్తకావిష్కరణానంతరం ‘‘సాహిత్య పరిశోధనా కళ: విధానం’’ గ్రంథాన్ని సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్ధులకు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు తన కుమారుడు కీ.శే.చెన్నసాయికిశోర్ స్మృత్యర్థం ఉచితంగా బహూకరిస్తారు. సభలో డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని పరిశీలించగలరు. తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్ధులు, ఎం.ఏ. చదువుతున్నవిద్యార్థినీ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి