రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పునరుజ్జీవాన్ని ప్రసాదించు దేవా

ప్రేమరాహిత్యపు ఎడారిలో
'దాహం'తో నేను...
ఆ ఒయాసిస్సుల్లో
అన్వేషిస్తున్నప్పుడు
వాత్సల్యామృతాన్ని
మనసు నిండుగా మన్నావై కురిశావు
కాఠిన్య భారతానికి
కరుణామయ ప్రపంచాన్ని చూపించావు
నన్నంతా దూరంగా ఛీ కొడుతున్నప్పుడు
నన్నాత్మీయంగా నీహృదయానికత్తుకున్నావు
ఊరూ వాడా
పేరూ  పెన్నిదీ లేని నాకు చిరునామా నిచ్చావు
నువ్వు చల్లిన విత్తనం  మొలకెత్తినా
ఒక్కోసారి సూర్య రశ్మి సోకకుండా
ముళ్ళపొదలు కమ్మేస్తున్నాయి
నన్ను పాములా అల్లుకుంటున్న
సాతానుశోధనలెన్నింటినో జయించడానికి
నువ్వు శిలువపై  రక్తం చిందించినా
నువ్వు శిలువపైనా
నిలువెత్తు ఆత్మవిశ్వాసమై నిలబడినా
ఈ దేహపు దేవాలయ తెరెందుకో చీలిపోతోంది
మిట్ట మధ్యాహ్నం
పట్టపగలు కళ్ళకెందుకో చీకట్లు  కమ్ముతున్నాయ్
నాకు మరోసారి పునరుజ్జీవాన్ని ప్రసాదించు దేవా!--- దార్ల


No comments: