రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

శుభాకాంక్షలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు

నాకు ఈ యేడాది యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారు ఛాన్సలర్ అవార్డు ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఎంతోమంది వాట్సప్, ఫేస్ బుక్, మెసేజెస్, ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కూడా అనేకమంది శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ పేరు పేరునా  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ముఖ్యంగా నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన నిపుణుల కమిటీకి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావు, ప్రో-వైస్ ఛాన్సలర్స్ ఆచార్య సంజయ్, ఆచార్య విపిన్ శ్రీవాత్సవ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య పంచానన్ మోహంతి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ తదితరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 
 సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావు గారి నుండి ఛాన్సలర్ అవార్డు స్వీకరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు


ఆంధ్రజ్యోతి కథనం

 No comments: