నిన్న 15 నవంబరు 2015 ఈటివి ఆంధ్రప్రదేశ్ ఛానల్ ‘తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉదయం 11-30 నిమిషాలకు ప్రసారమయ్యింది. దీనిలో అన్ని కుల వృత్తుల వారి భాష కూడా నిఘంటువుల్లోకి వచ్చినప్పుడు, వచన సాహిత్యాధ్యయనం విస్తృతంగా జరిగినప్పుడు తెలుగు భాషాభివృద్ధి జరుగుతుందని చెప్పాను. అలాగే స్థానిక సమస్యల్ని శక్తిమంతంగా మాతృభాషల్లో వ్యక్తం చేయగలిగితే ఆంగ్లభాషాధిపత్యాన్ని అడ్డుకోవడం, దాని స్థానంలో మాతృభాష ప్రత్యామ్నాయంగా మారడం కష్టమేమీకాదనీ చెప్పాను. మరిన్ని అంశాలను కింది వీడియోలో గమనించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి