"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

03 November, 2015

ప్రముఖులతో దార్ల

గుర్రం జాషువా జయంతి (2012) సందర్భంగా  తెలుగు అకాడమి సంచాలకుడు ఆచార్య కె. యాదగిరిగారు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గార్లతో సత్కారం

‘తెలుగు సాహిత్య విమర్శ’ రంగంలో చేసిన విశిష్టమైన కృషి చేసిన వారికి ప్రతి ఏడాదీ ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తిపురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను ప్రముఖ విమర్శకుడు, కవి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు కి ప్రకటించారు. 2013 నవంబరు 29న హైదరాబాదులోని శ్రీనందమూరి తారకరామారావు కళావేదికపై దుశ్శాలువ, వెయ్యినూటపదహారు రూపాయల నగదుతో డా.దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. , ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ యువకిరణాలు ప్రోగ్రామ్ చైర్మన్ ఆచార్య కె.సి.రెడ్డి ఈ  పురస్కారాన్ని ప్రదానం చేశారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిఆంధ్రప్రదేశ్ పూర్వ సాంస్కృతిక శాఖ సలహాదారు  డా.కె.వి.రమణాచారి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, డా. జె. చెన్నయ్య తదితరులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇతర వివిధ రంగాల్లో విశిష్టమైన కృషి చేసిన మరో 31 మందికి కూడా డా. దార్ల వెంకటేశ్వరరావుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాలతో సత్కరించారు.
డా. దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం, పరిశోధన, విమర్శ రంగాలకు సంబంధించి ఇప్పటి వరకూ సుమారు పదకొండు పుస్తకాలను, 45 పరిశోధన పత్రాలను రాసి, తెలుగు సాహిత్య విమర్శలో తనదైన ముద్రవేయగలిగారు. పునర్మూల్యాంకన విమర్శ, మాదిగ సాహిత్య విమర్శ, బహుజన సాహిత్య విమర్శలో  డా.దార్ల వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనలకు సమకాలీన విమర్శకుల ప్రశంసలు లభించాయి. సృజనాత్మక రచనలు చేయడం ఎలా? (2005), సాహితీ సులోచనం (2006), దళితసాహిత్యం- మాదిగదృక్పథం (2008), వీచిక 2009), పునర్మూల్యాంకనం (2010), బహుజన సాహిత్య దృక్పథం (2012) పుస్తకాలు ప్రదానంగా విమర్శకు సంబంధించినవి.  

భారతీయ దళితసాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ నుండి అవార్డ్ ను స్వీకరిస్తున్న సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ : 9 డిసెంబర్ , 2007షా ఆడిటోరియం, రాజనివాస్ మార్గ్ ,23 వ దళిత రచయితల జాతీయ సదస్సు , జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ ఆవరణం.భారత దేశ వ్యాప్తంగా వచ్చిన దళిత, దళితేతర రచయితలు,ప్రతినిధులతో రాజనివాస్ మార్గ్ కళకళలాడిపోయింది.ఈ డిసెంబరు నెలలోనూ చలి కురుస్తున్నా, ఆ ప్రాంతమంతా వేడి వేడిగానే ఉంది!సదస్సు నిర్వ్హహించడానికి తీసుకున్న షాఆడిటోరియం అక్కడికి వచ్చిన జనానికి సరిపోలేదు.ఎటుచూసినా డా.అంబేద్కర్, ఫూలే, మాయావతి తదితరుల చిత్ర పటాలే!వివిధ భాషల్లో వచ్చిన దళితసాహిత్యం ప్రదర్సించే స్టాల్ల్స్ తో ఆ ప్రాంతమంతా కళకళలాడిపోయింది.దళిత గేయాలతో, దళిత బంధువులతో పల్లవించింది.అనేక భాషల, ప్రాంతాల ఆ ప్రజలమధ్య పెనవేసుకున్న బంధం ఒక్కటే.తామంతా దళితులం. తమ సమస్యలన్నీ ఒకటే అనే భావనే వారిలో, వారి మాటల్లో వ్యక్తయ్యింది.ఆ దృశ్యాలు ఎంతోమంది దళితులకి ఆనందభాష్పాల్ని కురిపించాయి.చిత్రమేమిటంటే, ఇంత జరుగుతున్నా అక్కడి మీడియా ఏమాత్రం స్పందించలేదు.దళితులు అంత మంది వచ్చినా, జాతీయ సదస్సు నిర్వహించినా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది.మీడియా వైఖరి పట్లా, రావలసిన జాతీయ నాయకులు సభకి హాజరుకానందుకూ సభా వేదికపైనే కొంతమంది తీవ్ర నిరసన ధ్వనులూ వినిపించారు.తమిళనాడు నుండి వచ్చిన దళిత ప్రతినిధుల పాటలతో సభ మారుమ్రోగిపోయింది
Book Releasing of Punarmulyankanam at University of Hyderabad, 
డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘ పునర్మూల్యాంకనం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య హస్నైన్, ప్రో వైస్ చాన్సలర్ సారంగి, డీన్, స్కూల్ ఆఫ్ హుమానిటీస్ ఆచార్య వెంకట రమణన్  రచయిత దార్ల చిత్రంలో ఉన్నారు.

డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘బహుజన సాహిత్య దృక్పథం’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య హరిబాబు, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ. వి. కృష్ణ, ప్రముఖ పరిశోధకుడు, సిడాస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద      కేంద్రం, హైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (/సి),  ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు చిత్రంలో ఉన్నారు.


డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.
సభలో డా.దార్ల వెంకటేశ్వరరావుని సన్మానిస్తున్న దృశ్యం

ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ, జూపాక సుభద్ర, శిఖామణి
Felicitation for Prof.Simon Charsley
Darla Venkateswara Rao as a Cadet NCC Officer at Degree College Level


























No comments: