ఉస్మానియా విశ్వవిద్యాలయం, కన్నడశాఖ, హైదరాబాదు మరియు డా.బాబూజగజ్జీవన్ రామ్ స్టడీస్ అండ్ ఎక్సటెన్సన్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, దళిత్ స్టడీ సెంటర్ హైదరాబాదు వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘‘కన్నడ - తెలుగు దళిత సాహిత్యం’’ అనే అంశం పై ఒకరోజు జాతీయ సదస్సుని జూలై 7, 2015 వతేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల - న్యూ సెమినార్ హాల్ లో జరిగింది.
ఆచార్య ఎం.గోనానాయక్ గారు సభకి అధ్యక్షత వహించి, దానితో పాటు తెలుగు దళిత కథాసాహిత్యం పై పత్ర సమర్పణ చేశారు.
శ్రీమతి జూపాక సుభద్ర తెలుగు దళిత మహిళాసాహిత్యం గురించి మాట్లాడారు.
డా.దార్ల వెంకటేశ్వరరావు తెలుగు దళిత కవిత్వం గురించి పత్ర సమర్పణ చేశారు.
డా.దార్ల వెంకటేశ్వరరావు తెలుగు దళిత కవిత్వం గురించి పత్ర సమర్పణ చేశారు.
ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య మల్లేశ్ సంకుశాల ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. గౌరవ అతిధిగా ఆచార్య కె.బి.సిద్ధయ్య(సిద్దార్థ విశ్వవిద్యాలయం) పాల్గొన్న ఈ సదస్సులో డా. నటరాజ్ హులియార్ (బెంగుళూరు విశ్వవిద్యాలయం) కీలకోపన్యాసం చేశారు. ప్రారంభ సదస్సుకి ఆచార్య ఎ. రాములు ( ఆర్ట్స్ కళాశాల, హైదరాబాదు) అధ్యక్షత వహించారు. డా.బాబూజగజ్జీవన్ రామ్ స్టడీస్ అండ్ ఎక్సటెన్సన్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ డైరెక్టర్ ఆచార్య మైలహళ్ళి రేవణ్ణ, దళిత్ స్టడీ సెంటర్ సెక్రటరీ ఆచార్య వై.బి. సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్నడశాఖాధ్యక్షులు డా. గోనాల లింగప్ప అతిథులుగా పాల్గొన్నారు. తర్వాత కన్నడ-దళిత సాహిత్యాలపై సదస్సు కొనసాగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి