Saturday, July 18, 2015

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరులకు నివాళి

17 జూలై 2015 వతేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత్ స్టూడెంట్్స యూనియన్ ఆధ్వర్యంలో 30 ఏళ్ళ క్రితం కారంచేడులో దళితులపై జరిగిన దళితేతరు భూస్వాముల హత్యాకాండను నిరసిస్తూ 21-7-2015 న జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

సభలో డా. శ్రీపతిరాముడు, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.నాగరాజు, డా. ఈశ్వర్, ఆదినారాయణ, ఈశ్వర్, విన్సెంట్,ఉదయభాను, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతవీరులకు నివాళులు అర్పిస్తూ యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు కొవ్వొత్తులతీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ తీసారు. విద్యార్థినీ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మాదిగల కలలరూపమా సుందర్రాజా...(దళిత్ సాంగ్ సౌజన్యంతో)
No comments: