శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘నేను-నాపరిశోధన’’ అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ఎం.గోనానాయక్ గారి ప్రసంగాన్ని ఈ నెల 9 వతేదీన చిక్కడపల్లి, శ్రీత్యాగరాయ గానసభలో సాయంత్రం 6గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల విచ్చేశారు. ఆత్మీయ అతిధులుగా ఆచార్య ఎం. బాగయ్య, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. ఎ.సిల్మానాయక్, డా. కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులతోపాటు పలువురు సాహితీ వేత్తలతో సభ కళకళలాడింది. శ్రీమానస ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి, ప్రముఖకవి శ్రీరఘుశ్రీ, అధ్యక్షులు రామచంద్రరావు, ఉపాధ్యక్షలు, డా.లలితవాణి, కన్వీనర్ జె.వి.రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘నేను- నాపరిశోధన’’ అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన ఆచార్య ఎం. గోనానాయక్ గారు తన డాక్టరేట్ పరిశోధనాంశం ‘‘ గిరిజన సంస్కృతి : భాషా సాహిత్యాలు’’ గురించి మాట్లాడుతూ తన పరిశోధన నేపథ్యాన్ని అంతటినీ ‘నేను’ లో వివరించారు. ఈ నేను తెలుసుకుంటేనే నా పరిశోధనాంశం గురించి తెలుస్తుందని పరోక్షంగా సూచిస్తూ పరిశోధనలో తాను పాటించిన క్షేత్ర పర్యటన అనుభవాలను పేర్కొన్నారు. తనకు బంజారా భాష రావడం వల్లనే తన పరిశోధనలో అనేక సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవడానికి వీలైందనీ, లేకపోతే క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు పోలీసుల నుండి రక్షించుకోలేకపోయి ఒక నక్సలైట్ గా మిగిలిపోయి ఉండేవాడినని, అలాంటప్పుడు తన మాతృభాషే తనని కాపాడిందని చెప్పారు. తన జీవితాన్ని చెప్తున్నట్లు చెప్పినా గిరిజనుల జీవితం ఎలా ఉంటుందో వివరించేలే కథాకథనపద్ధతిలో చక్కగా వివరించారు. గిరిజనుల పేదరికాన్ని, అమాయకత్వాన్నీ, ఆకలినీ అర్థం చేసుకోకుండా వీరి సంస్కృతిని అవగాహన చేసుకోలేమన్నారు. గిరిజనులు అక్షరాలకోసమెలా ఆరాటపడతారో తన జీవితాన్నే ఒక ఉదాహరణగా వివరించారు. అక్షరాల కంటే ఆకలి తీర్చే అన్నం దొరకడానికైనా హాస్టలలు సీటు దొరికితే బాగుండునని ఆలోచించేవాణ్ణని అన్నారు. అక్కడ అ నుండి హ వరకు అక్షరాలు రాయగలిగితే సీటిస్తామన్నారని, దానికోసం ఒక మాస్టారు దగ్గరకు వెళ్లి అక్షరాలు నేర్పమంటే ఆయన ఒక సవాలు విసిరారని చెప్పారు. తనకు ఒక మంచం కావాలనీ, దానికి నాలుగు మంచం కోళ్ళు, పట్టీలు పట్టుకొని రమ్మన్నారని, అప్పుడ తన వయసు పదేళ్ళు కూడా లేవనీ అన్నారు. ఆ వయసులోనే అడవుల్లో తిరిగి మంచానికి సరిపోయే కట్టెలు కొట్టి, వాటిని వండ్రంగి దగ్గరకు తీసుకెళ్ళి మంచం చేయించికొచ్చానని చెప్పారు. అప్పుడు తనకు సీటుదొరికిందన్నారు. తర్వాత తెలంగాణాలో ఒక ఆంజనేయస్వామి గుడి దగ్గర పూజారి చేరదీశాడనీ, అప్పుడే తనకు రోజూ సుందరకాండ వినడం వల్ల శ్లోకాలు, పద్యాల పట్ల ఆసక్తి పెరిగిందనీ, దానితో పాటు ధారణా శక్తీ అలవడిందనీ వెల్లడించారు. ఇలా అడవుల నుండి ఊరుకీ, పట్టణానికీ, నగరానికి చేరిన తన జీవన యానాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. తన జీవితంలో అక్షరాలు నేర్పిన వాళ్ళనీ, ఆదరించిన వాళ్ళనీ గుర్తుచేసుకున్నారు. తనకు ఆచార్య ఎచ్.ఎస్. బ్రహ్మానంద, ఆచార్య తంగిరాల సుబ్బారావు మొదలైన వారు పరిచయం కావడంతో ‘‘ గిరిజన సంస్కృతి’’ పై తెలుగు సాహిత్యంలో తొలిపరిశోధన చేసే అవకాశం కలిగిందన్నారు. తాను తెలంగాణాలోని జిలాల్ని, రాయలసీమలోని కొన్ని జిల్లాల్ని తులనాత్మకంగా తన పరిశోధనలో స్వీకరించానని వివరించారు. తన దగ్గర చదువుకొని, తన దగ్గర తొలి పరిశోధన చేసిన డా.సిల్మానాయక్ ప్రస్తుతం ఆంధ్రసారస్వత పరిషత్ లో ప్రధానాచార్యులు ( ఎఫ్.ఏ.సి) గా ఉన్నారనీ, ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో ఉన్నారనీ, వాళ్ళని చూసినప్పుడు కలిగే ఆనందానికి మించి మరేమీ లేదన్నారు.
తన ప్రసంగాన్నిఆధ్యంతం గమనిస్తే చెప్పకుండానే అనేకాంశాల్ని చెప్పినట్లయ్యింది. గిరిజన జీవితాన్ని తెలుసుకోకుండా గిరిజన సంస్కృతిని అర్ధం చేసుకోలేమని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా తన జీవితాన్నే ఉదాహరణగా చూపారు. అంతే కాకుండా ఆరోజుల్లో ( 1990 ప్రాంతాల్లో) గిరిజనులకు సాహిత్యం ఎక్కడదని నిరాకరించేవారన్నారు. అలాంటప్పు గిరిజన సాహిత్యాన్ని, సంస్కృతినీ, భాషను అధ్యయనం చేయడానికి సంప్రదాయ శాస్త్రాలు మాత్రమే చూస్తే సరిపోదనీ, అన్నింటికీ మించి వీరి జీవితలోతుల్ని చూడాలన్నట్లు ఆ మాటెక్కడా చెప్పకుండా దాన్ని ‘‘ధ్వనింప’’ జేశారు. చివరికి ‘‘నేను’’ అనేది లేదు; సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు నన్నింతటి వాడిగా తీర్చిదిద్దాయని కాబట్టి ‘నేను’ అంటే ‘‘ వీళ్ళంతా’’ అవుతారని తన వినయాన్ని ప్రదర్శించారు. ప్రసంగం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
సభాధ్యక్షలు ఆచార్య నిత్యానందరావు గారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశోధనలు చేయాలంటే ఒక అంశాన్ని తీసుకొని సమగ్రంగా అధ్యయం చేసేవారనీ, అందువల్ల వాటి నుండి అనేక పరిశోధనలు చేయడానికి అవి ప్రేరణలుగా నిలిచేవనీ, అలాంటి పరిశోధనే ఆచార్య ఎం. గోనానాయక్ గారు చేసిన పరిశోధన అని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆచార్య గోనానాయక్ గార్ని శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభల వారూ సంయుక్తంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆచార్య గోనానాయక్ గార్ని శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభల వారూ సంయుక్తంగా సత్కరించారు.
ఆహ్వానపత్రం
ఆచార్య గోనానాయక్ గారి దగ్గర పరిశోధన చేసిన డా.ఎం.మంజుశ్రీ ఈ సందర్భంగా తన గురువు, తన పరిశోధన పర్యవేక్షకుడిని ఘనంగా సత్కరించారు. గురువుగార్ని దుశ్శాలువ, పూలు, పండ్లతో సత్కరిస్తున్న డా. మంజుశ్రీ
డా. మంజుశ్రీ తన గురువుగార్ని పువ్వులు, పండ్లతో సత్కరిస్తున్న దృశ్యం
డా. మంజుశ్రీ తన గురువుగార్ని పువ్వులు, పండ్లతో సత్కరిస్తున్న దృశ్యం
సభలో పాల్గొన్న సాహితీవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు
డా. మంజుశ్రీ తన గురువుగార్ని పువ్వులు, పండ్లతో సత్కరిస్తున్న దృశ్యం
ఆచార్య గోనా నాయక్ గార్ని విద్యార్థులు ఘనంగా సత్కరించారు.
తర్వాత సభలో పాల్గొన్న వక్తలందరినీ నిర్వాకులు సత్కరించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల గార్ని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
ఈ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆచార్య మల్లేష్ సంకశాల మాట్లాడుతూ ఆచార్య గోనానాయక్ గారు మాట్లాడుతుంటే ఒక జీవన దృశ్యాన్నేదో చూస్తున్నట్లు, ఒక వేదనా భరిత జీవనగీతికను వింటున్నట్లనిపించిదన్నారు. అందువల్ల తానేమి మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. పాశ్చాత్య దార్శినికుల తాత్త్వికతను ఆచార్య గోనానాయక్ గారి ప్రసంగంతో అన్వయించి వివరించారు. ‘‘నేను’’ అని ప్రసంగాన్ని ప్రారంభించినా, ఆ ‘‘నేను’’ అనే అస్తిత్వం ఎన్నెన్నో మలుపులు తిరిగి తొనొక పరిశోధన చేసిన తర్వాత మాత్రమే కనబడిందన్నారు.
సభాధ్యక్షత వహించిన ఆచార్య నిత్యానందరావుగార్ని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
ఆచార్య ఎం.బాగయ్య గార్న ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
డా. దార్ల వెంకటేశ్వరరావుని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
డా. దార్ల వెంకటేశ్వరరావుని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
డా. దార్ల వెంకటేశ్వరరావుని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
డా. సిల్మానాయక్ గార్న ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
డా. కళావేంకట దీక్షితులుగార్ని ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు.
సభలో పాల్గొన్న సాహితీవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు
సభను నిర్వహించిన రఘుశ్రీగార్ని ఆచార్య గోనానాయక్ గారు సత్కరించారు.
సభలో పాల్గొన్న డా.దార్ల వెంకటేశ్వరరావు
సభలో పాల్గొన్న డా.దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య గోనానాయక్ గారు తన ప్రసంగంలో తన పరిశోధన నేపథ్యాన్ని వివరించారనీ, దీనితో పాటు గిరిజనుల జీవితాన్ని అర్థం చేసుకొని, పరిశోధన చేసేవారు క్షేత్ర పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారన్నారు. తన ప్రసంగం అంతా నేడు తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్న ‘‘ఆత్మకథాత్మక సాహిత్యం’’ లా కొనసాగిందన్నారు. నేడు సాహిత్యంలో కొత్త కోణాల్ని Personal Narratives వల్లనే గుర్తించగలుగుతున్నారనీ వ్యాఖ్యానించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో ‘‘నేను’’ ఏకవచనం కాదనీ, అదొక బహువచనంగా అర్థం చేసుకోలేకపోతే కవిత్వ లక్ష్యాన్ని అవగాహన చేసుకోలేమన్నారు. ఆచార్య గోనా నాయక్ గారు ‘‘ నేను’’ అంటే ‘‘సమాజం’’ అని విశదీకరించారని విశ్లేషించారు.
గోనానాయక్ గారి ప్రసంగాన్ని అంతటినీ మూడు అంశాలుగా వివరించుకుంటే 1. దైవంపట్ల భకి, 2. పెద్దల పట్ల వినయం, 3 చేసిన మేలు మరిచి పోలేని కృతజ్ఞతా భావం ముప్పేటలా మనముందుంచారని డా. దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. నేడు కులం, మతం, ప్రాంతం, జెండర్... ఇలా విడిపోవడానికెన్ని అవకాశాలున్నాయో అన్ని అవకాశాల్ని వాడుకొంటూ వాటిని దుర్వినియోగపరిచే వాళ్ళు ఎక్కువవుతున్నారనీ, ఈ పరిస్థితుల్లో Positive Approach తో కూడిన ఈ ప్రసంగం ఎంతో విలువైందనీ, సందేశాత్మకంగా, ప్రేరణనిచ్చేలా ఉందని అన్నారు. ఆయనతో నాకున్న పరిచయాన్ని బట్టి, నేటి ప్రసంగాన్ని బట్టీ కూడా ఆయన గురించి ఒక్కమాటలో చెప్పమంటే ‘ వినయానికీ, మానవత్వ ప్రబోధానికీ ఆచార్య గోనానాయక్ గారు నిలువెత్తు నిదర్శనం’’ అంటాననీ అభివర్ణించారు.
సభలో పాల్గొన్న జనం
సభావేదికపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల, ఆచార్య ఎం.గోనానాయక్, డా.దార్ల వెంకటేశ్వరరావు ఉన్న దృశ్యం
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల గారు డా. దార్ల వెంకటేశ్వరరావుని అభినందిస్తున్న దృశ్యం
సభలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసోసియేట్ ఫ్రొఫెసర్ డా. సాగి కమలాకర శర్మ, కన్నడ శాఖలో ఫ్రొఫెసర్ లింగప్ప, తెలుగు అధ్యాపకుడు డా. రాజేశ్వరరావుగారు తదితరులు
సభలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసోసియేట్ ఫ్రొఫెసర్ డా. సాగి కమలాకర శర్మ, కన్నడ శాఖలో ఫ్రొఫెసర్ లింగప్ప, తెలుగు అధ్యాపకుడు డా. రాజేశ్వరరావుగారు తదితరులు
విద్యార్థులు, అధ్యాపకులతో ఆచార్య ఎం.గోనానాయక్ గారు
విద్యార్థులు, అధ్యాపకులతో ఆచార్య ఎం.గోనానాయక్ గారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి