"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

07 April, 2015

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డా.బాబూ జగజ్జీవన్ రామ్ జయంతోత్సవాల విశేషాలు



భారతదేశ పునర్మిర్మాణంలో విధాన నిర్ణాయక కర్తగా, ఆ విధానాలను అమలు పర్చిన వాళ్ళలో ఒకరుగా పనిచేసిన డా. బాబూ   జగజ్జీవన్ రామ్ గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో  5 ఏప్రిల్ 2015 వతేదీన అధికారికంగా నిర్వహించిన సభావిశేషాలను కొన్నింటిని మీతో పెంచుకోవాలనుకుంటున్నాను.  ఈ సభకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. వియన్నారావుగారు అధ్యక్షత వహించి డా. బాబూ జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యానికి ముందూ తర్వాత అనేక పదవుల్లో పని చేసి దేశ పునర్మిర్మాణానికి కృషిచేశారని కొనియాడారు. సభలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు మాట్లాడుతూ చిన్ననాటి నుండే డా.బాబూ జగజ్జీవన్ రామ్ క్రమశిక్షణకు మారుపేరనీ,  దళితుల ఆత్మగౌరవాన్ని భంగపరిచే పనుల్ని సహించలేకపోయేవారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి మాట్లాడుతూ అనేక బాబూ జగజ్జీవన్ రామ్ శాఖల్లో మంత్రి పదవి నిర్వహించారనీ, తాను చేపట్టిన ప్రతి శాఖను అంకితభావంలో పటిష్టపరిచారని అన్నారు. ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.కె.మధుబాబు మాట్గాలాడుతూ  డా. అంబేద్కర్ కి అనేక సందర్భాల్లోబాబూ జగజ్జీవన్ రామ్ సహకరించారని గుర్తుచేశారు.   సభలో పాల్గొన్న డా. ఉదయ్ కుమార్ డా.జగజ్జీవన్ రామ్ పనులను వివరించి వాటి వల్ల దేశానికీ, దళితులకీ ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. 

సభలో ప్రధాన వక్తగా నన్ను ఆహ్వానించారు.  వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటూ, వ్యవస్థీకృతంగా పోరాడుతూ దేశానికీ, అందులో భాగమైన పీడిత, దళిత వర్గం, కులాల వారి రక్షణకు, శ్రేయస్సుకి డా. బాబూ జగజ్జీవన్ రామ్ పాటుపడిన సంఘటనలకు సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాను. డా. అంబేద్కర్ అనేక సమయాల్లో డా. బాబూ జగజ్జీవన్ రామ్ సహకారం కోరారనీ,  అటువంటప్పుడు దళితుల ప్రయోజనాలకు భంగం కలిగే వాటిని ఎదిరించే క్రమంలో తానెంతో ఇష్టపడిన గాంధీజీని కూడా వ్యతిరేకించిన సందర్భాలను ప్రస్తావించాను. దీనికి సంబంధించిన లేఖలు, ప్రసంగాలు ఉన్న విషయాన్ని ఉటంకించాను. కార్మికులకు, దళితులకు అనేక చట్టాలను చేసిన ఘనత డా. బాబూ జగజ్జీవన్ రామ్ కి ఎలా దక్కుతుందో వాటిని సోదాహరణంగా వివరించాను. భారతదేశానికి హరిత విఫ్లవాన్ని తేవడంలో జగజ్జీవన్ రామ్ కృషి మరువలేనిదని వివరించిన ఆచార్య స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలను ఉటంకించాను. అలాగే రైల్వే శాఖలో మంత్రిగా ఉండగా దళితులకు అనేక ఉద్యోగాలను కల్పించడంతో పాటు, దళితులకున్న రిజర్వేషన్లను అమలు చేయడంలో బాబూజగజ్జీవన్ రామ్ పాత్ర శ్లాఘనీయమైందని వ్యాఖ్యానించాను. 
హిందూయిజాన్ని ఒక మతంగా కాకుండా దాన్నొక జీవన విధానం ( Way of Life) గా బాబూ జగజ్జీవన్ రామ్ కూడా పాటించి, దాన్నే జీవితాంతం వరకు నమ్మి ఆచరించడానికి కారణం తన తాత, తండ్రుల నుండి వచ్చిన ఆధ్మాత్మిక వారసత్వాన్ని వివరించాను. తండ్రి శోభీరామ్ హిందూజీవన విధానాన్ని అనుసరించడమే కాకుండా, దాన్ని ఇతరులకు ప్రబోధించడం వల్ల నిజమైన హిందూ భావజాలాన్ని తండ్రి నుండి తాను తెలుసుకున్నాడని, హిందూ భావజాలంలో చాలా వరకు ప్రతీకాత్మక భావనలు, జీవన మార్మికత్వం లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు చాతుర్వర్ణ్య వ్యవస్థను పాటించరనీ డా. బాబూ జగజ్జీవన్ రామ్ భావించాడనీ పేర్కొన్నాను. హిందూ జీవన విధానంలో కనిపించే సత్యం, శివం, సుందరం భావనలు నిజంగా అర్థం చేసుకుని దాన్ని పాటించేవాళ్ళు మానవుల మధ్య ఉండాల్సిన రాగద్వేషాలు తామరాకుమీద నీటి బిందువుల్లా భావిస్తారనీ, అలాంటి హిందూ జీవన విధానమే తొలివేదాల్లో ఉంటే తర్వాత వాటికి జరిగిన మార్పులు, చేర్పుల వల్ల... వాటికి వచ్చిన వివిధ వ్యాఖ్యానాల వల్ల క్రమేపీ మానవుల మధ్య అంతరాలు పెరిగిపోయి వర్ణ, కుల భేదాలు  రాగద్వేషాల్ని పెంచాయని తొలితరం దళిత నాయకులు గుర్తించారు. ఆ తరానికి చెందిన దళిత నాయకుని ఈ దార్శినికతను (Philosophy) అర్థం చేసుకుంటేనే  భారతీయ సామాజిక వ్యవస్థలో ఉండి వ్యవస్థీకృతంగా పోరాడ్డానికి డా.బాబూ జగజ్జీవన్ రామ్ చేసిన ప్రయత్నం అర్ధమవుతుందని వ్యాఖ్యానించాను. అయితే, నేడు మనం చూస్తున్నది హిందూ జీవన విధానం (Way of Life) గా కాకుండా హిందూమతం (Hindu Religion) తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మహాసముద్రం లాంటిది. బుద్ధుణ్ణి కూడా దశావతారాల్లో కలిపేసింది. అలాగే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక గ్రంథంలో డా. అంబేద్కర్ ని కూడా దశావతారాల్లో ఒకరిగా వ్యాఖ్యానించారు.  డా. బాబూ జగజ్జీవన్ రామ్ మాత్రమే కాదు తొలితరం దళిత నాయకులు, కవులు హిందూ జీవన విధానాన్ని ఇష్టపడ్డారు. జాషువా లాంటి వారు తప్ప తొలితరం దళిత కవులు బోయి భీమన్న, కుసుమ ధర్మన్న లాంటి వాళ్ళు తొలి దశలో ఉండే హిందూ జీవన విధానాన్ని నమ్మి, వేదాల్లో తర్వాత కులాన్ని చేర్చారని నమ్మారు. ఈ కవులను గౌరవించే మనం డా. బాబూ జగజ్జీవన్ రామ్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికీ, గుర్తించకపోవడానికీ మనలో ఉన్న రాగద్వేషాలు, అంతర్గత కులభావనలు పోవాలి. కుసుమధర్మన్నను గౌరవించేవాళ్లు, బాబూ జగజ్జీవన్ రామ్ ని ఎందుకు గుర్తించడం లేదు? దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుకీ అధ్యక్షుడుగా చేసెందెవరు? ఆనాడు అలా చేయకపోతే తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యుండేవాడా? ( దీన్ని నా ప్రసంగంలో రాసుకున్నా హడావిడి, ప్రసంగ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అక్కడ చెప్పలేకపోయాను.)

డా. బాబూ జగజ్జీవన్ రామ్ కులభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని నిర్మూలించడానికి చట్టాల్ని రూపకల్పన చేసినప్పుడు గాంధీజీ, సర్థార్ పటేల్ వంటి వారితో మాట్లాడి ఆ చట్టాన్ని తీసుకురావడంలో బాబూ జగజ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమైందని ప్రశంసించాను. అంతే కాకుండా గురురవిదాస్ సమ్మేళన్ ఏర్పాటు చేసి దళితుల్లో రావాల్సిన మార్పుల్ని, దళితులు సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా చెప్పి, చనిపోయిన జంతువుల మాంసాన్ని ఎందుకు తినకూడదో జగజ్జీవన్ రామ్ వివరించిన విధానాన్ని పేర్కొన్నాను. అలాగే మద్యాన్ని తాగకూడదనీ, దాన్ని తాగడం కూడా ఒక ఆచారంగా ఉండటం వల్ల గురురవిదాస్ శాఖ నుండి సుధాకర్ శాఖను ఏర్పాటు చేశాడనీ వెల్లడించాను. అయితే దళితులు మాంసాన్ని, చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడంలో భిన్నవాదనలున్నాయనీ, ఆర్య-ద్రావిడులకు జరిగిన పోరాటాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనీ గుర్తుచేశాను. తొలి రోజుల్లో కేవలం 5 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైన రిజర్వేషన్ల కాలాన్ని తర్వాత పదేళ్ళకు, మరలా మరోసారి పదేళ్ళకూ పొడించిన వారిలో డా.బాబూ జగజ్జీవన్ రామ్ పాత్రను మరిచిపోలేమనీ అభిర్ణించాను. 
డా.బాబూ జగజ్జీవన్ రామ్ కి స్వదేశంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, మదన్ మోహన్ మాలవ్యా , గాంధీజీ వంటి వారి దృష్టిలో పడ్డంతో ఉన్నత చదువులకంటే వెంటనే రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చిందన్నాను. Who were the sudras? (B.R.Ambedkar)  గ్రంథానికి బాబూ జగజ్జీవన్ రామ్ ముందుమాట (Foreword) రాశారనీ కానీ దాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదనీ చెప్పాను. 1970 లో పునర్ముద్రణ (Thakers and Company Ltd Publications, Bombayలో ఈ ముందుమాట కనిపిస్తుంది. బాబూ జగజ్జీవన్  రామ్ అప్పటికి Ministry of Food, Agriculture & Co operation లో కేంద్రమంత్రిగా ఉన్నాడు.  అంబేద్కర్ పాండిత్యం, లోతైన పరిశోధన కనిపించే గ్రంథంగాను, జాతి అభ్యుదయ పంథాలో పయనించడానికీ, మేథోగతంగా ఆలోచించడానికీ ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ ముందుమాటలో జగజ్జీవన్  రామ్ వ్యాఖ్యానించారన్నాను. బాబూ జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ మధ్య ఉన్న సంబంధాల్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలన్నాను. దానికి చరిత్రను సరిగ్గా అధ్యయనం చేయాలనీ, లేఖలు, ప్రసంగాలు, ప్రొసీడింగ్స్, సమకాలీకుల అభిప్రాయాలు వంటివన్నీ సేకరించినప్పుడే డా. బాబూ జగజ్జీవన్ రామ్ ని , ఆయన ఫిలాసఫీనీ, ఆయన దేశానికీ, దళితులకీ చేసిన కృషినీ సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతామని వివరించాను. మొత్తం మీద చూసినప్పుడు దళితులు ఈ దేశంలోనే పుట్టారు. ఈ దేశంలోనే జీవించాలి. ఈ దేశంలో అందరితో కలిసి మెలిసి నిజమైన ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలంటే సంస్కరణలే ఏకైకమార్గంగా బాబూజగజ్జీవన్ రామ్ భావించారు. దళితులకున్న భూమి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పదవులు వంటి వాటిలో దళితులకున్న భాగస్వామ్యాన్ని వాస్తవిక దృష్టితో విశ్లేషించుకునే దళితులకు నాడు సత్వరం కావలసిందేమిటంటే అందరితో కలిసి ఉంటూనే తమకి జరిగే అవమానాలకు, అన్యాయాలకు చట్టాలు అవసరం. వాటిని అమలు చేసే వాటిలో భాగంగా ఉంటేనే మంచిదనుకుని ఉంటారు. అందుకనే డా. అంబేద్కర్ విధాన నిర్ణయాల్ని ప్రభావితం చేసే దిశగా పోరాడితే, ఆ విధానాల రూపకల్పనతో పాటు వాటిని అమలు చేసే వారిలో భాగస్వామిగా ఉండటమే నాటి పరిస్థితులకు నిజమైన అవసరంగా భావించిన వాడు డా బూ జగజ్జీవన్ రామ్ గా భావించవచ్చుననుకుంటున్నాను. వ్యవస్థలో అంతర్భాగంగా పనిచేసే అధికారుల సేవలు దళితులకు ఒనగూరిన ప్రయోజనాలకు ప్రత్యక్షంగా చెప్పుకోలేకపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని అంతకుముందున్న పరిస్థితితో పోల్చుకుంటే తప్ప ఆ ప్రగతి స్ఫష్టం కాదు. అందువల్ల వ్యవస్థకు బయట ఉండి పనిచేసినంత స్వేచ్ఛ లేనట్లు పైకి కనిపించినా వాటిని అమలు చేయడానికి ఎంతో వీలున్నా దాన్ని చెప్పుకోలేకపోవచ్చు. అందువల్ల ఆ కృషి బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వాటిని పరిశోధన చేసి మరొకరెవరైనా చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది. ఆ కృషి డా. బాబూ జగజ్జీవన్ రామ్ విషయంలో చరిత్ర పునర్మిర్మాణం జరగాల్సి ఉంది.    ( పూర్తి ప్రసంగాన్ని రికార్డు చేశారు. దాన్ని వీలువెంబడి అందించే ప్రయత్నం చేస్తాను) 
సభలో సుమారు ఒక గంటవరకు మాట్లాడాను. విద్యార్ధినీ విద్యార్థులతో పాటు వైస్ ఛాన్సలర్, రెక్టార్, రిజిస్ట్రార్ మొదలైన వాళ్ళు కూడా సభ అయ్యేవరకూ ఉన్నారు. నా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నట్లు అనిపించింది. 





సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను.



ఆంధ్రజ్యోతి దినపత్రిక, గుంటూరు ఎడిషన్ లో ది 6-4-2105న ప్రచురించిన వార్తాకథనం

సభకు ముందు విద్యార్థినీ విద్యార్థులు విశ్వవిద్యాలయం ఆవరణంలో డప్పు నృత్యాలతో, నినాదాలతో మారుమ్రోగిస్తూ ఊరేగింపు చేశారు. 

సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను.

సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను.

సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను. ఈ ఫోటోని ప్రజాశక్తి దినపత్రిక ప్రచురించింది.
సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను.

సభకు ముందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న డా. బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంజనీర్ తదితరులు నివాళులు అర్పించారు. దీనిలో నేను కూడా ఉన్నాను.

ఆలోచనాత్మక ఆవేశం జగ్జీవన్ రాం సొంతం
ఎ ఎన్ యూ : ఆవేశం ఉన్నవారికి ఆలోచన, విచక్షణ ఉండదని చాలామంది చెబుతారని, సమాజంలో తాను ఎదుర్కొన్న అవమానాల వల్ల వచ్చిన ఆవేశాన్నే ఆలోచనగా మలుచి వాటి నిర్మూలనకు కృషి చేసిన మేధావి బాబూ జగజ్జీవన్ రాం అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు విభాగం అధ్యాపకుడు, కవి డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన భారత మాజీ ఉపప్రధాని  బాబూ జగజ్జీవన్ రాం 108 వ జయంతి వేడుకలకు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రాం ప్రభుత్వంలో ఉంటూనే దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ, అంటరానితనం నిర్మూలనపై ప్రభుత్వాలకు ఎన్నోలేఖలు రాశారని తెలిపారు. వాటిని వెలుగులోకి తెస్తేనే దళితులకు ఆయన చేసిన కృషి మరింతగా తెలుస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ శాఖల గణాంకాలను పరిశీలిస్తే ఆయన కృషి మరింత తేటతెల్లమవుతుందన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలు, మేధోపరమైన నిర్ణయాల వెనుక జగ్జీవన్ రాం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన విసీ మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి ఆద్యుడు జగ్జీవన్ రాం అన్నారు. దేశభద్రత, జాతీయ నిర్మాణం వంటి అంశాల్లో జగ్జీవన్ రాం కీలక సేవలు అందించారన్నారు. గాంధీ కూడా జగ్జీవన్ రాం సేవలు కొనియాడారని తెలిపారు. రెక్టార్ ఆచార్య కే ఆర్ ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్  డాక్టర్ కె. మధుబాబు, యుజి పరీక్షల కో ఆర్డినేటర్ డా. ఎల్. ఉదయ్ కుమార్, డాక్టర్ జి. శ్రీనివాస్, ఎంఎస్ ఎఫ్ నాయకులు పుల్లయ్య, వెంకి, శ్రీహరి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
-సాక్షి, గుంటూరు జిల్లా, పుట: 11, తేది: 6 ఏప్రిల్ 2015
సభ జరిగిన వార్తా కథనాన్ని సాక్షి పత్రిక, గుంటూరు జిల్లా ఎడిషన్ లో ప్రముఖంగా ప్రచురించింది.


సభ జరగడానికి ముందు డా. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం. పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావుగారు

సభ జరగడానికి ముందు డా. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం. పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ గారితో పాటు నేను. 
సభ జరగడానికి ముందు డా. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం. పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు

సభ జరగడానికి ముందు డా. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం. పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు


 సభలో మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావుగారు

 సభలో  నేను మాట్లాడుతున్న దృశ్యం

సభలో ఉన్న విద్యార్థులు కొంతమందికి సంబంధించిన దృశ్యం


సభావేదికపై వైస్ ఛాన్సలర్, నేను, రిజిస్ట్రార్ మరికొంతమంది ఉన్న దృశ్యం

సభావేదికపై వైస్ ఛాన్సలర్, నేను, రిజిస్ట్రార్, రెక్టార్, ఎన్.ఎస్.ఎస్. కోర్డి నేటర్ తదితరులు


సభావేదికపై వైస్ ఛాన్సలర్, నేను, రిజిస్ట్రార్, రెక్టార్, ఎన్.ఎస్.ఎస్. కోర్డి నేటర్ తదితరులు

 సభానంతరం విద్యార్థులు డా. బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికలాంగ విద్యార్థికి ట్రైసైకిల్ ని బహూకరించారు.

సభలో పాల్గాన్న నాకు, నా శ్రీమతి డా. మంజుశ్రీకి అధికారులు సన్మానం చేశారు.

సభలో పాల్గాన్న నాకు, నా శ్రీమతి డా. మంజుశ్రీకి విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు  సన్మానం చేశారు.

సభలో పాల్గాన్న నాకు, నా శ్రీమతి డా. మంజుశ్రీకి విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు  సన్మానం చేశారు.


వైస్ ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావు గార్కి సన్మానం

రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు గార్కి సన్మానం

వైస్ ఛాన్సలర్ ఆచార్యవియ్యన్నారావుగార్కి విద్యార్థినీ విద్యార్థుల ప్రత్యేక సన్మానం

రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు గార్కివిద్యార్థినీ విద్యార్థుల ప్రత్యేక సన్మానం

సభానంతరం విద్యార్థినీ విద్యార్థులతో నేనూ, నా శ్రీమతి డా. మంజుశ్రీ

సభ ప్రారంభానికి ముందు విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పలు వసతి గృహాల్లో డా. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

సభ ప్రారంభానికి ముందు విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో డప్పులను మోగిస్తూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, దళిత ఆత్మగౌరవనినాదాలతో ఊరేగారు.

సభ ప్రారంభానికి ముందు విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో డప్పులను మోగిస్తూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, దళిత ఆత్మగౌరవనినాదాలతో ఊరేగారు.

సభ ప్రారంభానికి ముందు విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో డప్పులను మోగిస్తూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, దళిత ఆత్మగౌరవనినాదాలతో ఊరేగారు.

డా.బాబూ జగజ్జీవన్ రామ్ 107 వ వర్థంతి సభ జరిగిన డా.హెచ్. హెచ్. డిచ్ మన్, డా.ఎస్.జాన్ డేవిడ్ ఆడిటోరియం 


సభ ప్రారంభానికి ముందు ఆడిటోరియం గెస్ట్ హౌస్ లో నేను.


సమావేశానంతరం నాకిచ్చిన సూట్ లో రిలక్స్ గా కూర్చుంటే విద్యార్థులు తీసుకున్న ఫోటో

సమావేశానంతరం  గుండెనిండా సంతోషంతో, రెండు చేతుల నిండా బ్యాగ్స్ తో హైదరాబాదు వచ్చేశాను.  ఇదిగో మీతో ఇలా ముచ్చటిస్తూ.... మీ
దార్ల
(7 ఏప్రిల్ 2015) 


No comments: