Saturday, April 11, 2015

hcu పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఒక రోజు

నిన్న (11 ఏప్రిల్ 2015) మా యూనివర్సిటీ ( యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు)లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం (ALUMNI MEET) జరిగింది.
నేను, నా భార్యతో కలిసి మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో వెళ్ళాను. 
అక్కడ ఎన్.ఎస్.ఎస్ విద్యార్థలు కృష్ణవేణి, మహేందర్ తదితరులున్నారు.  లోపలికి ఆహ్వానిస్తూ నవ్వుతూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు... అంతకు ముందే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మళ్ళీ పెట్టారట... సౌకర్యార్థం... బాగుందనుకున్నాను. 
అప్పటికే డిఎస్ టి ఆడిటోరియంలో ప్రసంగాలు మొదలైయ్యాయి.
చాలా మంది తమ ఆత్మీయమైన అనుభూతులను కలబోసుకున్నారు. 
స్టూడెంట్స్ వెల్ఫేర్ ఢీన్ ఆచార్యప్రకాశ్ బాబుగారు సభను బాగా నిర్వహించారు

వైస్-ఛాన్సలర్ ఆచార్య హరిబాబుగారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఢీన్ ఆచార్యప్రకాశ్ బాబుగారు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వేదికపై ఉన్నారు.
ప్రకాశ్ బాబు గారు సభను బాగా నిర్వహించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వాళ్ళే అంటూనే కొంతమందికి మాత్రమే  మాట్లేడే అవకాశం ఉందని సున్నితంగానే చెప్పారు. 
మాట్లాడిన వాళ్ళు కూడా విసిగించలేదు.
తమ అనుభూతులను నెమరు వేసుకున్నారు.
ALUMNI MEET కి సంబంధించి ఈనాడు దినపత్రిక, 12 ఏప్రిల్ 2015న ప్రచురించిన కథనం 

వేదికపై మాట్లాడ్డానికంటే బయట సరదాగా కలిసిముచ్చటించుకోవడానికే ఎక్కువమంది ఆసక్తి చూపించినట్లనిపించింది. 
చిన్నపిల్లల్లా ALUMNI MEET టీషర్ట్స్ వేసుకొని ఫోటోలు దిగడం అధ్బుతమైన దృశ్యంగా కనిపించింది.

కొంతమంది చాలా రోజుల తర్వాత కలిసినా ఎప్పటి నుండో నిత్యం కలిసినంత ఆత్మీయంగా పలకరించుకున్నాం.
కొంతమందిని గుర్తుపట్టినా నిజం చెప్పొద్దూ... పేర్లు మర్చిపోయాం...
రూపులు మారిపోయాయి.
మాటల్లో పెద్దరికం వచ్చేసింది.
కొంతమందిలో మాత్రం ఆ కలివిడితనం, ఆ చిలిపితనం అలాగే ఉన్నాయ్...
వాళ్లతో కలిసినప్పుడు చిరుజల్లుల్లో తడిసినట్లనిపించింది.
భట్టి విక్రమార్క గారు పంచెకట్టుకొని వచ్చారు. ఆయనా మా యూనివర్సిటీ పూర్వవిద్యార్థే. 
నిజానికి ఆయనే అందరికీ ఎట్రాక్షన్ గా మారారు.
అందరితో నవ్వుతూ పలకరించారు. చాలా మంది ఆయనతో ఫోటో తీయించుకున్నారు.
నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాను.
భట్టి విక్రమార్క గారితో నేను 

భట్టి విక్రమార్క గారితో ఆచార్య స్వరూపరాణిగారు, నేను

భట్టి విక్రమార్క గారితో డా.సేనాపతి సత్యనారాయణ, ఆచార్య శర్మగారు 

ALUMNI MEET లో పాల్గొన్న పూర్వవిద్యార్థుల్లో కొంతమంది 

గ్రూపు ఫోటోలు 
ఎవరికి కావలసిన వాళ్ళు వాళ్ల వాళ్ల గ్రూపులుగా ఫోటోలు తీసుకున్నారు.
సాయంత్రం మీటింగ్ అయితే ఇంకా బాగుండేదనిపించింది.
చాలామంది దంపతులుగా, కుటుంబసమేతంగా వచ్చారు. 
వాళ్ళు క్యాంపస్ చూడ్డానికి యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక వాహనాల్ని సమకూర్చారు. 
ఒక పూర్వవిద్యార్థి మాట్లాడుతూ పూర్వవిద్యార్థులకు గుర్తింపు కార్డులివ్వాలన్నారు. అంతా కరతాళ ధ్వనులతో ఆయనకి మద్ధతు ప్రకటించారు. నిజమేనండోయ్...క్యాంపస్ లో సెక్యూరిటీ అలా ఉంది మరి... 
స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ విన్సెంట్, మా విద్యార్థి మిత్రుడు ఆదినారాయణ, రీసెర్చ్ స్కాలర్ ప్రభాకర్ తదితరులు
స్టూడెంట్ యూనియన్ ప్రసిడెంట్ విన్సెంట్ మాట్లాడుతూ కాన్సర్ తో పోరాడుతున్న కొప్పుల నాగరాజుకి సహకరించాలని అభ్యర్థించాడు. 
స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ విన్సెంట్
అదే విషయాన్ని చెప్తూ చిట్టిబాబు పడవల కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా కొప్పుల నాగరాజుకి సహాయ సహకారాలు అందించడానికి, నాగరాజు పనిచేసిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ యూజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఒక తీర్మానం చేయాలని కూడా విజ్ఞప్తి చేశాడు.
సభను నిర్వహిస్తున్న ఆచార్య ప్రకాశ్ బాబు గారు సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దాన్ని ఆమోదించినట్లు సభలోని వాళ్లంతా కరతాళధ్వనులు చేశారు. 
ఈ ALUMNI MEETని మరింత బాగా నిర్వహిస్తే బాగుండుననిపించింది. తగిన ప్రచారం చేయకపోవడం వల్లనో, తక్కువ సమయంలోనే నిర్ణయాలు తీసుకోవడం వల్లనో, మరెందువల్లనో చాలామందికి తెలియలేదనుకుంటున్నాను. లేకపోతే ఇంకా బాగుండేదనిపించింది. మా తెలుగు విద్యార్థులు పెద్దగా కనిపించలేదు. అదో నిరాశగా కూడా అనిపించింది నాకు. 

No comments: