రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బాబూజగజ్జీవన్ రామ్ గారి 107వ జయంతి సభలో దార్ల ప్రసంగం

భారత ఉపప్రధాని, పీడితజనులకు ఆశాజ్యోతి బాబూజగజ్జీవన్ రామ్ గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ది 5 ఏప్రిల్ 2015న ఒక సభను నిర్వహిస్తున్నారు. దీనికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. వియన్నారావుగారు అధ్యక్షత వహిస్తారు. సభలో యూనివర్సిటీ రెక్టార్  ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి, ఓ.ఎ.డి. ఆచార్య ఎ.వి. దత్తాత్రేయరావు యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రాంబాబు, యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి. చంద్రశేఖరరావు, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.కె.మధుబాబుగార్లు ఈ సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు.  ప్రధాన వక్తగా నన్ను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రం ఇది.

No comments: