రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

శెహబాస్ సూర్య పత్రిక యాజమాన్యం....

సాధారణంగా కొన్ని పత్రికల్లో పనిచేసేవాళ్ళు చనిపోతే ఆ పత్రికలో  ఆ వార్తకు కూడా నోచుకోని వాళ్ళెంతోమంది ఉన్నారు. కొన్ని పత్రికలు మాత్రం పనిచేసే సిబ్బంధి క్యాడర్ ని బట్టి ప్రాధాన్యాన్నిస్తుంటాయి. సూర్య పత్రిక మాత్రం నిన్న చనిపోయిన ఎడిట్ పేజీ ఇన్ చార్జి శ్రీ హరనాథ్ గారి మరణానికి చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. రెండవపేజీలో కలర్ ఫోటోలతో వార్తను రాసింది. 

అంతేకాకుండా  పత్రిక చైర్మన్ , ఎడిటర్, డైరెక్టర్ తదితర సిబ్బంది వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన వార్త కూడా వేశారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ఎడిషన్ లో శ్రీ హరనాథ్ గారికి నివాళి అర్పిస్తూ ఫోటో పెట్టారు. 
ఇంటర్నెట్ ఎడిషన్ లో శ్రీ హరినాథ్ గారికి నివాళి అర్పిస్తూ పెట్టిన ఫోటో
తమ పత్రికకోసం పనిచేసిన వ్యక్తి చనిపోతే ఈ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా వాళ్ళకిచ్చే నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. సూర్య పత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందినీ అభినందిస్తున్నాను.... 


No comments: