శ్రీ అనంత పద్మనాభ కళాశాల, వికారాబాదు లో నేను తెలుగు
అధ్యాపకుడుగా పనిచేస్తుప్పుడు చాలా మంది విద్యార్ధినీ, విద్యార్ధులు కవితలు, కథలు, వ్యాసాలు వంటివి ఎలా రాయాలని
అడుగుతుండేవారు. దీన్ని విద్యార్ధులను, ఔత్సాహిక రచయితలను
దృష్టిలో పెట్టుకొని రాశాను.
నిజానికి పాఠాలు చెప్పేటప్పుడు, రచనలు చేయడానికి పనికొచ్చే
కొన్ని విషయాలు చెప్తున్నా, సృజనాత్మక రచనలు ఎలా చేయాలో, దానిపైనే దృష్టిని కేంద్రీకరించి
తరగతి గదుల్లో సర్వసాధారణంగా చెప్పారు. ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రసిద్ధులైన కొంత
మంది రచయితల రచనలను, వాటి
పై నేను చేసిన విశ్లేషణను అందిస్తున్నాను. దీన్ని చదివి మీ సృజనాత్మక నైపుణ్యాన్ని
పెంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే దీనిపై మీకేమైనా సందేహాలు, సూచనలు అందించాలనుకుంటే నాకు మీ
అభిప్రాయాలను రాయవలసినదిగా కోరుతున్నాను.
-డా// దార్ల వెంకటేశ్వరరావు
5-9-2007
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి