రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రాయక్క మాన్యం పుస్తకావిష్కరణ


ప్రముఖ కవి, రచయిత్రి, విమర్శకురాలు జూపాక సుభద్ర రాసిన రాయక్క మాన్యం కతల సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరుగుతుంది. సిరిసిల్ల, జగిత్యాల రైతు కూలీ పోరాట యోధురాలు కొదురుపాక రాజవ్వ ఈ పుస్తకాన్ని ఆవిష్యరిస్తారు. ప్రొ పులికొండ సుబ్బాచారి ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రొ ముని రత్నమ్మ, ప్రొ చల్లపల్లి స్వరూపరాణి, ప్రొ గుండె డప్పు కనకయ్య, జ్వలిత, డా షాజహానా, గంధం విజయలక్ష్మి, డా దార్ల వెంకటేశ్వరరావు, డా జి.వి. రత్నాకర్‌, కృపాకర్‌ మాదిగ ప్రసంగిస్తారని మట్టిపూలు రచయిత్రుల వేదిక, హైదరాబాద్‌ తెలిపింది. 


జూపాక కథలు ఆవిష్కరణ
జూపాక సుభద్ర దళిత మహిళల కథల సంపుటి 'రాయక్క మాన్యమ్' ఆవిష్కరణ సభ ఈ నెల 12న సా.6 గం.లకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్, హైదరాబాద్‌లో జరుగనుంది. ఆవిష్కర్త రైతు-కూలీ పోరాట యోధురాలు కొదురుపాక రాజవ్వ, అధ్యక్షత డా.పులికొండ సుబ్బాచారి, వక్తలు ఎన్.మునిరత్న మ్మ, డా. చల్లపల్లి స్వరూపరాణి, జ్వలిత, డా.షాజహానా, గంధం విజయలక్ష్మి, డా.గుండెడప్పు కనకయ్య, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. జివి రత్నాకర్, కృపాకర్ మాదిగ.
- మట్టిపూలు రచయిత్రుల వేదిక

http://www.andhrajyothy.com/node/92648

 

No comments: