రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రాయక్క మాన్యం కతల సంపుటి ఆవిష్కరణ సభ

ప్రముఖ కవి, రచయిత్రి, విమర్శకురాలు జూపాక సుభద్ర రాసిన రాయక్క మాన్యం కతల సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. సిరిసిల్ల, జగిత్యాల రైతు కూలీ పోరాట యోధురాలు కొదురుపాక రాజవ్వ ఈ పుస్తకాన్ని ఆవిష్యరించారు.  ప్రొ పులికొండ సుబ్బాచారి ఈ సభకు అధ్యక్షత వహించారు. ప్రొ ముని రత్నమ్మ, అరుణోదయ విమలక్క, జ్వలిత, డా షాజహానా, గంధం విజయలక్ష్మి, డా దార్ల వెంకటేశ్వరరావు, డా జి.వి. రత్నాకర్‌, కృపాకర్‌ మాదిగ ప్రసంగించారు. ఈ సభలో నేను మాట్లాడిన సారాంశాన్ని త్వరలోనే అందిస్తాను....దార్ల

No comments: