courtesy: http://knstrct.com
మనుషుల్ని రోబోలుగా
రోబోల్ని మనుషులుగా చేసేయ్.
మరకమంచిదే నంటూ
గొడుగుమ్యాన్ కీ
ఉతుక్కోవడానికో సబ్బునిచ్చేయ్
శిక్షణనిచ్చేదీ, శిక్షించేదీ నువ్వే
నటించమనేదీ, ఆ నాట్యవిన్యాసాల్ని
రంగుల డబ్బాల్లో చూపించేదీ నువ్వే.
తెలియకొకసారినీ వల్లో పడినా,
తెలిసినా బయటపడల్లేని మన్మోహనం నీది
తెలియనట్లు నటించేయక తప్పని తిప్పలు.
ప్రపంచానికో సుందరిని ప్రకటించు
విలువలూ, వలువలూ అన్నీ ఒలిచేయ్
ప్రపంచనలుమూలల్నుండీ
ప్రపంచానికి కనిపించని లావాదేవీలన్నీ ముగించేసేయ్
నీకు నువ్వే సాటి
నమ్మకానమ్మేవాళ్ళున్నంతకాలం
నీ నమ్మకాన్ని కొనేవాళ్ళున్నంతకాలం
నీ నమ్మకాన్ని కొనేవాళ్ళున్నంతకాలం
నిన్ను నమ్మేవాళ్ళున్నంతకాలం
నీకు నువ్వేసాటి.
మనుషుల్ని రోబోలుగా
రోబోల్ని మనుషులుగా చేసేయ్.
-దార్ల వెంకటేశ్వరరావు
9-1-2014
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి