Monday, December 16, 2013

మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలుపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012 సంవత్సరానికి గాను ‘‘తెలుగు సాహిత్య విమర్శ’’ విభాగంలో నాకు కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది ఆత్మీయులు శుభాకాంక్షలు తెలిపారు. నా పట్ల, నా సాహిత్యం పట్ల చూపిన వాత్సల్యానికి, అభిమానానికి, గౌరవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
 మా గురువులు ఆచార్య ముదిగొండవీరభద్రయ్య, ఆచార్య ఎన్.ఎస్.రాజు, ఆచార్య పరిమి రామనరసింహం గార్లు  ఫోను చేసి అభినందనలు తెలిపారు. గురువుల అభినందనలు నన్ను పులకాంకితుణ్ణి చేశాయి. డిపార్టుమెంటులో ఆచార్య తుమ్మల రామకృష్ణగారు ప్రత్యేకంగా అభినందించారు. నన్ను నిరంతరం ప్రోత్సాహించే ఆచార్య కె.కుసుమారెడ్డి గారు అభినందించారు. అలాగే మా తెలుగుశాఖ అధ్యాపకులు డా.పిల్లలమర్రి రాములు, డా.పమ్మిపవన్ కుమార్, డా.డి.విజయలక్ష్మి, డా.బి.భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారేమిటి? ఈ రోజు పత్రికలు చూడలేదు. ఏమి  జరిగింది? ఏమి వచ్చింది? అంటూ అడిగిన ఆచార్య ఎస్. శరత్ జ్యోత్న్నారాణిగారికి వివరిస్తూ దార్లకు కీర్తిపురస్కారం వచ్చినందుకు అభినందిస్తున్నామని వారు చెప్పారు. ‘‘కీర్తిపురస్కారమా? అదేమిటి? అదెవరిస్తారు? ’’ అని మేడమ్ ఆశ్చర్యంగా అడిగారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిస్తారని అక్కడున్న అధ్యాపక బృందం వివరించి చెప్పారు. ‘‘అలాగా....స్వచ్ఛంద సంస్థలిచ్చే అవార్డులకైతే గుర్తింపులేదు. ఇది విశ్వవిద్యాలయం వారిచ్చేది కదా... దీన్ని గుర్తించవచ్చు. శుభాకాంక్షలు’’ అన్నారు.  నవంబరు 29 వతేదీన తెలుగు డిపార్టుమెంటులో దుశ్శాలువా, ఫ్లవర్ బొకేతో మా డిపార్టుమెంటు వాళ్ళంతా అభినందించారు. డిపార్టుమెంటు హెడ్ గా, నా శిష్యుడిగా నిన్ను అభినందిస్తూ, సత్కరిస్తున్నానని మేడమ్ అన్నారు.ఈ సత్కారం జరిగేటప్పుడు పైన చెప్పిన మా తెలుగు అధ్యాపకులతో పాటు ఆచార్య ఆర్. వి, ఆర్. రామకృష్ణశాస్త్రి గారు కూడా ఉన్నారు.
ప్రముఖ కవి డా.కోయి కోటేశ్వరరావు పొద్దున్నే ఫోను చేసి ’’తమ్ముడూ దార్లా... కంగ్రాట్యులేషన్స్. ఈ పురస్కారం మన దళితసాహిత్య విమర్శకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను అన్నాడు. కృపాకర్ మాదిగ ఫోను చేసి చాలా సేపు మాట్లాడారు. ఇది, తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాలకు, మాదిగసాహిత్యానికి నువ్వు తీసుకొచ్చిన గుర్తింపుకి లభించిన పురస్కారం అన్నారు. జూపాక సుభద్ర కూడా అభినందించారు. డిగ్రీకళాశాల అధ్యాపకులు డా.సురేష్ కుమార్, డా.విజయానందరాజు, డా.విజయకుమార్ తదితరులు ఫోను చేసి అభినందించారు.
డా. జె.భీమయ్య, ఆచార్య వెలిదండ నిత్యానందరావు, ఆచార్య ననుమాసస్వామి, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ఆచార్య యోహానుబాబు, ఆచార్య ఎస్వీసత్యనారాయణ, డా. సూర్యాధనుంజయ్, డా. విస్తాలి శంకరరావు, డా. గుండిమెడ సాంబయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
మా పరిశోధక విద్యార్థులు డా.మజ్జి దుర్గారావు, సుమన్, గిన్నారపు ఆదినారాయణ, శ్రీదేవి, రాజేందర్; నాగమల్లయ్య, ఉమేష్, సంజీవ్ కుమార్, బాలిరెడ్డి, వెంకటేశ్ తదితరులంతా శుభాకాంక్షలు తెలిపారు.
కీర్తి పురస్కారం వచ్చినట్లు పత్రకలో చదివానని తెల్లవారగట్లే ఫోను చేసి మొట్టమొదటిసారిగా చెప్పిన విద్యార్థి హనుమంతరావు. తర్వాత మా విద్యార్థులు చాలా మంది ఫోను చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పురస్కారం అందుకునే రోజున నా జీవితభాగస్వామి మంజుశ్రీ,  అమ్మ, తమ్ముడు డా. దార్ల రవికుమార్, మా బావమరిది శశి, మరదళ్ళు కనకదుర్గ, మాయాదేవి, మా తోడళ్ళుడు వెంకటేష్ కుటుంబసమేతంగా వచ్చారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న మా విద్యార్థులు హానెస్టు, హనుమంతరావు తదితరులు సభకి హాజరైయ్యారు. పురస్కారప్రదానం రోజున మా విద్యార్థులు సుమన్, ఆదినారాయణ, శ్రీదేవి,  నాగమల్లయ్య, సంజీవ్ కుమార్, సింహాచలం, చింతలయ్య తదితరులు వచ్చారు. ఆరోజున డా ఏ.కె.ప్రభాకర్, ఆచార్య శిఖామణి, డా. దాసరి వెంకటరమణ తదితరులు ఎంతో మంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పేర్లు మరిచిపోవడం కాదుగానీ, గుర్తు రాని వాళ్ళెంతోమంది ఉన్నారు. వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

1 comment:

Anandakiran said...

meeru ilantivi marenno sadhinchali