ఇంగ్లీష్ & విదేశీభాషల విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలోHMTV వారి సౌజన్యంతో ’వృత్తి పురాణాల పరిశోధన కేంద్రం’వారు 2013 డిసెంబరు 31 నుండి 2014 జనవరి 1 వరకు రెండు రోజుల పాటు ’జానపదకళలు-వృత్తిపురాణాలు‘ అనే జాతీయ సదస్సుని హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు సదస్సు సంచాలకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎమిరిటస్ ఫ్రొఫెసర్ ఆచార్య ననుమాసస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు సమావేశాలుగా జరిగే ఈ జాతీయ సదస్సులో వృత్తి పురాణాల పై పరిశోధన చేసిన, చేస్తున్న పరిశోధకులు, పరిశోధక విద్యార్థులు పత్రసమర్పణ చేస్తారన్నారు. ఈ సందర్భంగా ఇప్లూ క్యాంపస్, హైదరాబాదులో ఈ నెల (డిసెంబరు,2013) 31 వతేదీన మధ్యాహ్నం నుండి సురభాండేశ్వరనాటకం,పద్మనాయకపురాణం,తొమ్మిది మెట్ల కిన్నెరగానం ప్రదర్శనలతో జాతీయసదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన ప్రారంభానికి ఆచార్య మసన చెన్నప్ప, డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొంటాని చెప్పారు. అలాగే 4గంటల 30నిమిషాలకు జాతీయ సదస్సు ప్రారంభ పభ ఉంటుందనీ, దీనిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య కిషన్ రావు సభను ప్రారంభిస్తారని, ముఖ్యఅతిధిగా పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి , విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.రాళ్ళపల్లి కవితాప్రసాద్, గౌరవఅతిథిగా మైసూరు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆర్వీఎస్ సుందరం, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇఫ్లూ విశ్వవిద్యాలయం ఆచార్యులు జి.తిరుపతి కుమార్ పాల్గొంటారని, ఆచార్య ననుమాసస్వామి సభాధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి