09 ఆగస్టు, 2012
కవిత్వంలో ప్రేమతత్త్వం
కొంతమంది ప్రతిదాన్నీ చక్కని కవిత్వం చేస్తుంటారు. జాన్ హైడ్ కనుమారిగారి బ్లాగు నడక చదువుతుంటే మరలా ఒకసారి బైబిల్ ని ఆత్మీయంగా స్పర్శించాలనిపిస్తుంది. నేను పదవతరగతి వరకు బైబిల్ వదిలేవాడిని కాదు. రోజూ చదివేవాడిని. చర్చికి వెళ్లేవాడిని. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి...మళ్ళీ నడక బ్లాగు చదువుతుంటే. నడక బ్లాగులో ప్రేమను పంచే కవిత్వం కనిపించింది. ఇలాగే మెర్సిమార్గరెట్ అని ఒకామె బాగా రాస్తున్నారు. బైబిల్ ని చెప్తున్నా, కవిత్వం రాస్తున్నట్లుండడం వీరి ప్రత్యేకత. నా మనసు బాగా లేనప్పుడు నడక చదవాలనిపిస్తుంది....దార్ల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి