రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వందేళ్ల కథకు వందనాలు - పోరంకి దక్షిణామూర్తి "చంద్రవంక"

వందేళ్ల కథకు వందనాలు - పోరంకి దక్షిణామూర్తి "చంద్రవంక" కథ:ఎపిసోడ్-40  నిన్న రాత్రి hmtv లో ప్రసారం అయ్యింది. కథని గొల్లపూడి మారుతీరావుగారు బాగా పరిచయం చేశారు. ఆ పూర్తి కథను చదవాలంటే hmtv లో చూడండని టీవీవారు ప్రకటిస్తే చూశాను. అయితే గొల్లపూడి మారుతీరావుగారు చదివిన భాగాలేమీ ఇక్కడలేవు. బహుశా మిస్ అయ్యాయేమే. hmtv వారు ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది.

ఇక కథ విషయానికొస్తే, చంద్రవంక మూడుతరాల వారి ఆలోచనల్ని ప్రతిబింబించే మంచికథ. మారుతున్న సామాజిక పరిస్థితుల్ని ప్రతీకాత్మకంగా వివరించిన కథ. కథలో మనవడు భగవద్గీత, వైద్యశాస్ర్తం వంటివాటిని పట్టుకున్నట్టు గొల్లపూడివారు చదివారు. కానీ ఆ భాగం ఇక్కడ మిస్ అయ్యింది. ఏది ఏమైనా తక్కువసమయంలోనే కథని చదువుతూ, దాని సారాంశాన్ని చెప్పి, కొంత విశ్లేషణ కూడా చేస్తున్నారు. చక్కని సాహితీకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న hmtvవారికీ, గొల్లపూడి వారికీ అభినందనలు...
-డా.దార్ల వెంకటేశ్వరరావు

No comments: