Wednesday, February 01, 2012

ఆలోచింపజేసిన జాంబవపురాణం ప్రదర్శన


 యూనివర్సిటీ దళిత విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో బుధవారం(01-02-2012) సాయంత్రం జాంబవపురాణం జానపద కళాప్రదర్శన జరిగింది.
 
కళాకారుల ప్రదర్శన
శ్రీవేంకటేశ్వర కళా బృందం  గెడ్డం కిష్టయ్య నాయకత్వంలో దీన్ని జనరంజకంగా ప్రదర్శించారు. సాయంత్రం మూడు గంటల పాటు రసవత్తరంగా జరిగిన ఈ ప్రదర్శనకు విద్యార్ధినీ విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.
 ఈ ప్రదర్శనకు హాజరైన విద్యార్ధినీ విద్యార్థులు
 ఈ ప్రదర్శనకు హాజరైన విద్యార్ధినీ విద్యార్థులు, అధ్యాపకులు 
సృష్ట్యాదికి నుండీ నేటి మాదిగ, మాలల జీవన పరిస్థితుల వరకూ చక్కని గ్రామీణ జానపద భాషలో ప్రదర్శిస్తూ అందర్నీ ఆలోచింపజేశారు. 

కళాకారుల ప్రదర్శన
కళాకారులను అభినందిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.జె.భీమయ్య
కళాకారులను కొంత పారితోషికంతో అభినందిస్తున్న డా.దార్లవెంకటేశ్వరరావు
కళాకారులను పారితోషికంతో అభినందిస్తున్న సెంట్రల్ యూనివర్సిటి దళిత విద్యార్థి సంఘం అధ్యక్షుడు శాంతిస్వరూప్, ఇతర సభ్యులు
జాంబపురాణం, జాంబవపురాణం అని పిలిచే ఈ పురాణం గురించి ఇప్పటికే తెలుగు కొన్ని లిఖిత గ్రంథాలు వచ్చినా, ఆచార్య పి.సుబ్బాచారి, ఆచార్య జయధీర్ తిరుమలరావు లు వెలువరించిన వాటిలో అనేకాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పురాణం గురించి కింద కొన్ని అభిప్రాయాల్ని ఇస్తున్నాను. ‘‘మహత్తర పురాజ్ఞాపకాల నుండి ఈ మానవ జన్మ పరంపరని సుకృతంగా భావిం చే పవిత్ర భావన కొనసాగిస్తూ, సమాజం తమ మీద విధించిన శాపాన్ని, తమని నిర్దయగా అణచేసేవారిని ప్రశ్నించి నిలబడే తత్వాన్ని పొందడానికి చేసే యాత్రే జాంబపురాణం. ఆనందం (బుడ్డన్‌ఖాన్), అద్భుతభావన (సృష్టిజననం), తమ స్త్రీ దైవాలు బలహీనపడిన వైనం (ఆదిశక్తి నిర్వీర్యం), పురుషదైవ ఆవిర్భావం (పరమేశ్వరుడు) వీటి మధ్య అందరికన్నా బలశాలి, ధీశాలి తమ కుల పురుషుడు (తాతా జాంబవుడు) తమ చుట్టూ ఉన్న తమ పోషకులు, శూద్ర ప్రజల సయోధ్య-సామరస్యం-ఇవీ జాంబపురాణంలో కనిపించే ముఖ్యమైన అంశాలు ’’ ఆంధ్రజ్యోతి 21-6-2011 ‘‘ ‘‘వివిధ’’
‘‘మనువాదానికి వ్యతిరేకంగా మాదిగ సంస్కృతిని ప్రచారం చేసే సమాంతరపురాణం జాంబపురాణం.ప్రధానంగా మాదిగ కుల పురాణం అయినా భూమిమీద ప్రాణికోటి పుట్టుక దగ్గరనుంచి భిన్న కులాల, ఉపకులాల ఉత్పత్తి, అస్తిత్వాల గురించి కూడా తెలియజేస్తుంది. ఇందులో 5 ప్రథాన కథలున్నాయి.1.ఆదిపురాణం 2.పార్వతీ కల్యాణం 3.మాలచెన్నయ్య పురాణం 4.ఆరంజ్యోతి కల్యాణం 5.బలభద్ర విజయం.పటం చూపించి కథ చెప్పే మౌఖిక సంప్రదాయంలో ఇంతవరకూ డక్కలి కళాకారులుతరతరాలుగా కాపాడుకొస్తున్న ఈ పురాణాన్ని ఎంతో కష్టపడి జయధీర్ తిరుమలరావు బృందం గ్రంథస్థం చేసింది.దళిత తాత్విక చింతనకు ఈ పురాణం పునాది.’’
 ‘‘సుపథ ’’  వెబ్ సైట్ జయధీర్ తిరుమల రావు గారి సంపాదకత్వంలో వచ్చిన ‘‘ డక్కలి జాంబపురాణం’’ గురించి చేసిన పరిచయం.
Jambapuranam - The Origin of the Cindu Madigas
Jambu Purana and Dalits : 

2 comments:

Sirapangi Santhi Swaroop said...

Thanks for presenting a comprehensive review on the programme Sir,along with scholarly interpretations.

Santhi Swaroop Sirapangi,
President,
Dalit Students' Union,
University of Hyderabad.

Anonymous said...

చాల ముఖ్యమైన విషయాన్ని తెలిపారు, ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే దయచేసి తెలపగలరు.
వీడియో ఏమైనా ఉంటే సోషియల్ మీడియా లో పంచుకోగలరు

కూతల దయాలన్