రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

'సాక్షి' సీనియర్ రిపోర్టర్ ఉమేష్ మృతి!

మిత్రుడు ఈర్ల ఉమేష్ ఆకస్మికంగా కొద్దిసేపటి క్రితమే చనిపోయాడని తెలిసింది. ప్రస్తుతం ఉమేష్ "సాక్షి"లో పనిచేస్తున్నాడు. నేను రేడియోలో పనిచేసేటప్పుడు నాకు అతడు మిత్రుడు. యువవాణి తెలుగులో మంచి కార్యక్రమాల్ని రూపొందించేవాడు. ఏ పనినైనా అంకితభావంతో చేసేవాడు. నాకు రేడియో కార్యక్రమాల్ని రూపొదించేటప్పుడు అనేక సాంకేతికాంశాల్ని నేర్పించేవాడు. మృధుస్వభావిగా ఉండేవాడు. అతడు అప్పుడే మరణిచాడంటే చాలా బాధ అనిపిస్తుంది. 
అతని మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..... దార్లవెంకటేశ్వరరావు.

No comments: